Viral Video: వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా బయటపడిందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2021-10-20T23:55:59+05:30 IST

హల్దూచుర్‌, లల్కున్‌ నదుల మధ్యన పాచ్‌ల్యాంగ్‌ అనే ఒక ద్వీపం ఉంది. ఇక్కడ ఓ ఏనుగు వరదలో చిక్కుకుని విలవిల్లాడింది. ఓ వైపు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు ఏనుగు అందులో చిక్కుకుని.. ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తోంది..

Viral Video: వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా బయటపడిందో మీరే చూడండి..

వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కొన్నిసార్లు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగుతూ ఉంటాయి. మరి అడవుల్లో సంభవించే వరదల్లో చిక్కుకునే జంతువుల పరిస్థితి గురించి ఆలోచిస్తే బాధేస్తుంది. ఇలాగే భారీ వరదలో చిక్కుకున్న ఓ ఏనుగు.. తన ప్రాణాలను కాపాడుకునేందుకు పెద్ద సాహసమే చేసింది. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వంకలు, వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు.


హల్దూచుర్‌, లల్కున్‌ నదుల మధ్యన పాచ్‌ల్యాంగ్‌ అనే ఒక ద్వీపం ఉంది. ఇక్కడ ఓ ఏనుగు వరదలో చిక్కుకుంది. ఓ వైపు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు ఏనుగు అందులో చిక్కుకుని.. ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తోంది.. చూస్తుంటేనే అయ్యో పాపం.. అనిపిస్తుంది కదా. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎట్టకేలకు ఆ ఏనుగు.. వరద ముప్పు నుంచి తప్పించుకుని, తనకు సాటి తానే అని నిరూపించుకుంది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాన్ని స్థానిక అటవీ డివిజనల్‌ అధికారి సందీప్‌ కుమార్‌.. సెల్‌ఫోన్‌లో బంధించాడు. అనంతరం అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లి.. ఏనుగును దారి మళ్లించి అడవిలోకి పంపించారు.  సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.



Updated Date - 2021-10-20T23:55:59+05:30 IST