ఇళ్ల నిర్మాణాలకు చర్యలు : హౌసింగ్‌ పీడీ

ABN , First Publish Date - 2022-08-18T05:54:23+05:30 IST

ప్రభుత్వం కేటాయించిన జగనన్న ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసు కుంటున్నామని హౌసింగ్‌ పీడీ అల్లూరి వెంకట రామరాజు అన్నారు.

ఇళ్ల నిర్మాణాలకు చర్యలు : హౌసింగ్‌ పీడీ
సమావేశంలో మాట్లాడుతున్న హౌసింగ్‌ పీడీ

ఆకివీడు, ఆగస్టు 17: ప్రభుత్వం కేటాయించిన జగనన్న ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసు కుంటున్నామని హౌసింగ్‌ పీడీ అల్లూరి వెంకట రామరాజు అన్నారు. నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన్‌ జామి హైమావతి, కమిషనర్‌ చోడగం వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు, సచివాలయ ఉద్యోగులతో బుధవారం సమావేశం నిర్వహిం చారు. ఆకివీడు మండలంలో 3800 ఇళ్లు మంజూరు కాగా 936 ఇళ్లు వివిధ స్థాయిలో ఉండగా వీటిలో 150 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. హౌసింగ్‌ డీఈ పెన్మెత్స శివరామరాజు, ఏఈ భాస్కరరాజు, వైస్‌ చైర్మన్లు పుప్పాల పండు, వంగా జోత్స్న, పడాల శ్రీనివాసరెడ్డి, మేనేజర్‌ వెంకటేశ్వరరావు, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.

Updated Date - 2022-08-18T05:54:23+05:30 IST