30 లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం : రంగరాజు

ABN , First Publish Date - 2021-06-20T04:28:49+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్లు కట్టిస్తున్నామని గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు.

30 లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం : రంగరాజు
యండగండిలో ఇంటి నిర్మాణాన్ని పరిశీలిస్తున్న మంత్రి శ్రీరంగనాథరాజు

ఉండి, జూన్‌ 19 : రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్లు కట్టిస్తున్నామని గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఉండి మండలం యండగండిలో ముత్యాలమ్మ, శివాలయం, ఎస్సీ కాల నీలోని జగన్నన హౌసింగ్‌ కాలనీ లేఅవుట్లను శనివారం మంత్రి పరిశీలిం చారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 17 వేలకుపైగా కాలనీలు రానున్నాయన్నారు. దసరా నాటికి గృహ నిర్మాణ పనులు పూర్తిచేసుకుని గృహ ప్రవేశాలు జరుపుకునేలా సిద్ధంగా ఉండాల న్నారు. తన స్వగ్రామమైన యండగండిలో 311 మంది లబ్ధిదారులకుగాను 80 మందికిపైగా గృహ నిర్మాణాలను చేపట్టారన్నారు. మిగిలిన వారు సోమవారం పనులను చేపట్టనున్నారన్నారు. ఇళ్ల నిర్మాణాలు ప్లానింగ్‌ సరిగా లేనందున గృహనిర్మాణ అధికారులపై, సచివాలయం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌పై మంత్రి రంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిన్నకృష్ణ మూర్తి, ఉపసర్పంచ్‌ పేరిచర్ల జగ్గరాజు, ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు, ఎంబీసీ చైర్మన్‌ పేండ్ర వీరన్న, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, హౌసింగ్‌ డీఈఈ సిద్ధాంతి, తహసీల్దారు కృష్ణజ్యోతి, ఎంపీడీవో గంగాధరరావు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-06-20T04:28:49+05:30 IST