Abn logo
Jun 20 2021 @ 00:44AM

కలెక్టర్‌ను కలిసిన హౌసింగ్‌ జేసీ భార్గవ్‌తేజ్‌

కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న భార్గవ్‌తేజ్‌

భానుగుడి (కాకినాడ), జూన్‌ 19: జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (గృహనిర్మాణం)గా బాధ్యతలు స్వీకరించిన ఎ.భార్గవ్‌తేజ్‌ శనివా రం కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌.. భార్గవ్‌తేజ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భార్గవ్‌తేజ్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్లు డాక్టర్‌ జి. లక్ష్మిశ, కీర్తి చేకూరిలను కలిశారు. అంతకుముందు డీఆర్‌వో సత్తిబాబు కొత్త జేసీ భార్గవ్‌తేజ్‌ను పూలమొక్క బహూకరించి ఆహ్వానించా రు. ఈ సందర్భంగా భార్గవ్‌తేజ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాలో సేవలందించే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉందన్నారు. పటిష్టప్రణాళికతో వివిధ శాఖలతో సమ న్వయం చేసుకుంటూ పేదల ఇళ్ల నిర్మాణంలో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తా నని ఆయన పేర్కొన్నారు.