గృహ నిర్మాణ పనులు చేపట్టాలి : కలెక్టర్‌ హరినారాయణన్‌

ABN , First Publish Date - 2021-07-25T06:08:23+05:30 IST

ప్రభుత్వం పేదల గృహ నిర్మాణాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత హౌసింగ్‌ అధికారుతో పాటు అన్ని శాఖల అధికారులపై ఉన్నందున సమన్వయంతో పనిచేయాని కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు.

గృహ నిర్మాణ పనులు చేపట్టాలి : కలెక్టర్‌ హరినారాయణన్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

 చిత్తూరు (సెంట్రల్‌), జూలై 24: ప్రభుత్వం పేదల గృహ నిర్మాణాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత హౌసింగ్‌ అధికారుతో  పాటు అన్ని శాఖల అధికారులపై ఉన్నందున సమన్వయంతో పనిచేయాని కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి కుప్పం, పలమనేరు, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, నియోజకవార్గల చెందిన మండల స్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  గ్రౌండింగ్‌ పూరైన నేపధ్యంలో గృహ నిర్మాణాలకు వెళ్లాలన్నారు. ప్రతి మండలంలో ఏఈలకు కేటాయించిన లక్ష్యాలను ఆగస్టు 15లోపు పూర్తి చేయాలన్నారు. జేసీ (హౌసింగ్‌) వెంకటేష్‌ మాట్లాడుతూ ఐటీ మేనేజర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్ల సహకారంతో ప్రతి మండలంలో మాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ పద్మనాభం పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T06:08:23+05:30 IST