హౌసింగ్‌ బకాయిలు చెల్లించాలి

ABN , First Publish Date - 2020-09-30T11:15:35+05:30 IST

ఒంగో లులో పీఎంఏవై- ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ బ కాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీడీ పీ నాయకులు డిమాండ్‌ చేశారు.

హౌసింగ్‌ బకాయిలు చెల్లించాలి

 టీడీపీ నాయకుల డిమాండ్‌


ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 29: ఒంగో లులో పీఎంఏవై- ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ బ కాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీడీ పీ నాయకులు డిమాండ్‌ చేశారు. బకాయిలను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం ఆపార్టీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ నాయకు లు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హ యాంలో 4262 మంది లబ్ధిదారులు ఇళ్లు కుట్టుకున్నారని అన్నారు. వీరిలో 1476 మందికి బకాయిలు ఉన్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇంతవరకు బకాయిలు చెల్లించకపోవ డం దుర్మార్గంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పం దించి వెంటనే హౌసింగ్‌ బకాయిలు చెల్లించాలని డిమాం డ్‌ చేశారు.


అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లాప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గు ర్రాల రాజ్‌విమల్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివా సరావు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మ జ,  ఆర్ల వెంకటరత్నం, పాతూరి పుల్లయ్య చౌదరి, బొమ్మి నేని మురళీకృష్ణ, బొల్లినేని వాసు కృష్ణ, ఎద్దు శిశకాంత్‌భూ షణ్‌, దాయినేని ధర్మ, పి.చినవెంకటేశ్వర్లు, పసుపులేటి సునీత, ఎల్‌టీ భవాని, డొక్కా శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-30T11:15:35+05:30 IST