కొవిడ్‌ నియంత్రణకు ఇంటింటికీ జ్వర సర్వే

ABN , First Publish Date - 2022-01-21T06:20:44+05:30 IST

కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని శుక్రవారం నుంచే మొదలు పెట్టాలని వైద్య, అరోగ్య , ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీ్‌షరావు అన్నారు.

కొవిడ్‌ నియంత్రణకు ఇంటింటికీ జ్వర సర్వే
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అధికారులు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ ఓపీ సేవలు అందించాలి 

 వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్య శాఖ మంత్రి హారీ్‌షరావు   

సిరిసిల్ల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని శుక్రవారం నుంచే మొదలు పెట్టాలని వైద్య, అరోగ్య , ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీ్‌షరావు అన్నారు. గురువారం పంచాయతీరాజ్‌ మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కొవిడ్‌ నియంత్రణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హారీ్‌షరావు మాట్లాడుతూ గ్రామాల వారీగా, వార్డుల వారీగా బృందాలను ఏర్పాటు చేసి ప్రతి రోజు 25 ఇళ్ల చొప్పున ఇంటంటి సర్వే నిహించాలని అదేశించారు. అశా వర్కర్‌, ఏఎన్‌ఎం, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ సిబ్బందితో సర్వే బృందాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి కొవిడ్‌ లక్షణాలతో ఉంటే హోం ఐసోలేషన్‌ కిట్‌ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న కిట్ల మందులు బాగా పని చేస్తున్నాయని ఐదు రోజులు వాడితే సరిపోతుందని అన్నారు. సర్వే బృందం ప్రతి రోజు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని అన్నారు. 15 నుంచి 17 సంవత్సరాల వారికి మొదటి డోసు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని అర్హులైన వారందరికీ వంద శాతం వ్యాక్సినేషన్‌ చేయించాలని బూస్టర్‌ డోస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ టెస్టు కిట్లు, మందులు నిల్వ ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కొవిడ్‌ వార్డులను ఏర్పాటు చేశామని ఆక్సీజన్‌ వార్డులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. కొవిడ్‌ రోగులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని పోలీస్‌ కమిషనర్లు, సూపరింటెండెంట్‌లు ప్రజలందరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ కోసం ఓపీ ప్రారంభించాలని అన్నారు. మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ కొవిడ్‌ నియంత్రణ చర్యలో భాగంగా గ్రామానికో నోడల్‌ అఫీసర్‌ను నియమించాలని అన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమే్‌షకుమార్‌ మాట్లాడుతూ కొవిడ్‌తో మరణించిన వారికి ప్రభుత్వం చెల్లించే ఎక్స్‌గ్రేషియాను త్వరగా మంజూరు చేయాలని అదేశించారు. మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారి కేసులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, డీపీవో రవీందర్‌ డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌లు సమ్మయ్య, శ్యాంసుందర్‌రావు, సర్వేలెన్స్‌ అధికారిణి డాక్టర్‌ మీనాక్షి, ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T06:20:44+05:30 IST