Abn logo
Aug 11 2020 @ 03:58AM

ఇళ్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

అవనిగడ్డ టౌన్‌ : నియోజకవర్గంలో గృహాలు, మరుగుదొడ్ల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని  టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. 4242 గృహాలు నిర్మాణం పూర్తయ్యాయని, 600 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. 870 మందికి రూ.7.60 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.  కొల్లూరి వెంకటేశ్వరరావు, లుక్కా శ్రీనివాసరావు, పుల్లగూర రాజేంద్రరావు, రాసినేని శ్రీనివాసరావు, రేపల్లె అంకినీడు, బాబు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement