రాష్ట్రంలోని పేదలకు ఇళ్లు, మూడెకరాల భూమి ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-08-15T05:34:11+05:30 IST

రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం ఇండ్లు, మూడె కరాల భూ పంపిణీ చేయాలని మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి దు ద్దిళ్ళ శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలోని పేదలకు ఇళ్లు, మూడెకరాల భూమి ఇవ్వాలి
మాట్లాడుతున్న శ్రీధర్‌బాబు

- ఆజాది కా గౌరవ్‌ పాదయాత్రలో ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు

మంథని, ఆగస్టు 14: రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం ఇండ్లు, మూడె కరాల భూ పంపిణీ చేయాలని మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి దు ద్దిళ్ళ శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పుర స్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదికా గౌరవ్‌ పాదయాత్రను మంథని, గంగాపురి ప్రాంతాల్లో శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆదివారం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ చౌక్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ స్వాతంత్య్ర ఉద్య మంలో లేదన్నారు. వజ్రోత్సవాల వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచిందన్నారు. వీటిని అదుపు చేయాలని డిమాండ్‌ చేశారు. సోనియా, రాహుల్‌గాంధీలను ఎన్‌డీఏ ప్రభత్వం అనే క ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇండ్లు, మూడెకరాల భూ పంపిణీపై వేడుకల్లో ప్రక టన చేయాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సుధీర్ఘంగా కొనసా గిన క్విట్‌ఇండియా ఉద్యమంలో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ తోపాటు ఎందరో జైలు జీవితాలు అనుభవించిన పోరాడి, త్యాగాలు చేసి దేశ ప్రజలను ఐక్యం చేసి చివరకు దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టారన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటానికి నెహ్రూ పం చవర్ష ప్రణాళికలు రూపొందించారన్నారు. పీవీ నర్సింహారావు, మన్‌మో హన్‌ సింగ్‌ ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక అభివృద్ధికి కీలక అయ్యాయ న్నారు. రాజీవ్‌గాంధీ కృషితో దేశంలో సాంకేతిక విప్లవం వచ్చిందన్నారు. దేశ కోసం ఇందిరగాంధీ, రాజీవ్‌గాంధీలు ప్రాణత్యాగం చేశారన్నారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు సెగ్గెం రాజేష్‌, శశిభూషణ్‌కాచే, పెండ్రి రమాదేవీ-సురేష్‌ రెడ్డి, తిరుపతియాదవ్‌, రఘోత్తంరెడ్డిలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T05:34:11+05:30 IST