ఇంటింటా జ్వర సర్వే

ABN , First Publish Date - 2022-08-13T05:57:30+05:30 IST

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు పెరు గుతున్నాయి. ఇప్పటికే డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి కేసులు పలు ఆసుపత్రుల్లో నమోదు అవుతున్నాయి.

ఇంటింటా జ్వర సర్వే

- లక్షణాలున్న వారికి అక్కడికక్కడే కిట్లు

- జిల్లాలో ఇప్పటికే 1,460 జ్వర పీడితుల గుర్తింపు

జగిత్యాల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీజనల్‌ వ్యాధులు పెరు గుతున్నాయి. ఇప్పటికే డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి కేసులు పలు ఆసుపత్రుల్లో నమోదు అవుతున్నాయి. దీంతో వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులు మరింత ప్రబలకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌ రవి నాయక్‌ ఆదేశాల మేరకు వ్యాధుల నియం త్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వివిధ శాఖలకు చెందిన సి బ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి పరిసరాలను పరిశీలి స్తున్నారు. ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది జ్వర సర్వేను ని ర్వహిస్తున్నారు. ఈ సర్వేలో ప్రధానంగా జ్వరం లక్షణాలున్న వారిని, జ్వర పీడితులను గుర్తిస్తున్నారు. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగ ర్‌ ఉన్న రోగులను గుర్తిస్తు నాన్‌ కమ్యూనికేషనల్‌ డిసీజ్‌ (ఎన్‌సీడీ) నిర్వ హిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 10,54,000 జనాభాలో 52.69 శాతం మంది మూడు పదుల వయస్సును దాటిన వారు ఉన్నారు. జిల్లాలో 19 పీహెచ్‌సీలు, 151 సబ్‌ సెంటర్లు, 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 9 ఉన్నాయి. జిల్లాలో విలేజ్‌ హెల్త్‌ రిజిస్ట్రేషన్‌ (వీహెచ్‌ఆర్‌)లో 8,92,732 మంది ఇప్పటివరకు నమోదయ్యారు. 

సర్వేలో 715 వైద్య బృందాలు

గడిచిన వారం రోజులుగా నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేలో బాధి తులను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గుర్తిస్తున్నారు. జిల్లాలో 1వ తేది నుంచి ఈనెల 7వ తేదీ వరకు నిర్వహించిన సర్వేలో 1,460 మంది జ్వర పీడితులను వైద్య సిబ్బంది గుర్తించారు. జిల్లాలో 715 వైద్య బృందాలు ఇంటింటి జ్వర సర్వేను నిర్వహిస్తున్నాయి. ఇందులో ఇప్పటివరకు 2,60, 516 గృహాలను సందర్శించి 2,75,598 మందిని పరీక్షించారు. ఇందులో 1,460 మంది జ్వరంతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. 

వారం రోజులుగా నిరంతరాయంగా సర్వే...

వారం రోజులుగా నిరంతరాయంగా జ్వర సర్వేను నిర్వహిస్తున్నారు. నీటి నిల్వ ఉన్న ప్రదేశాలల్లో దోమలు తయరయ్యేందుకు సుమారు పది రోజులు పడుతోంది. ప్రజలను అప్రమత్తం చేసి నిల్వ నీటిని ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రా మాల్లో పర్యటిస్తూ గడప గడపకూ వెళ్లి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఇతర ఆరోగ్య వివరాలను సైతం తెలుసుకుంటున్నారు. సీజన్‌ ముగిసే వరకు ప్రతీ పది రోజులకో సారి సర్వేను నిర్వహించనున్నారు. 

స్పెషల్‌ డ్రైవ్‌తో...

జిల్లాలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నా రు. ఇంటింటికి రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ, ఐసీ డీఎస్‌ సిబ్బంది ఆయా సందర్భాల్లో వెళ్తున్నారు. నీటి తొట్టెలు, పాడైపో యిన సామగ్రిలో నిల్వ ఉండే నీటిని పరిశీలిస్తున్నారు. డెంగీ కేసులు న మోదు అయిన ప్రాంతాలను హైరిస్క్‌ ఏరియాలుగా గుర్తించి ప్రత్యేక పా రిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో వారంలో రెండు రో జులు డ్రై డే నిర్వహిస్తున్నారు. ఇంటి పరిసరాలు, కాలనీల్లో నిల్వ ఉన్న నీటిలో దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నారు. 

ఇంటి వద్దకే మందుల కిట్లు...

జ్వర పీడితుల ఇంటి వద్దకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి మందు ల కిట్లను అందిస్తున్నారు. సంబంధిత కిట్స్‌లలో గల మందులను ఎలా వాడాలో వివరిస్తున్నారు. ఇప్పటివరకు 1,460 మంది జ్వర పీడితులకు  మెడికల్‌ కిట్స్‌లను పంపిణీ చేశారు. మధుమేహం, రక్తపోటు, అధిక రక్త పోటుతో బాధపడుతున్న వారికి మందులతో కూడిన కిట్టును అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. చదువు రాని వారికి సైతం ఉద యం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఏ మందులు వేసుకోవాలో ప్రజలకు అర్థమయ్యేలా కిట్టును రూపొందించారు. 

పకడ్బందీగా సర్వే చేస్తున్నాం

- డాక్టర్‌ సమీయోద్దిన్‌, ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా జ్వర స ర్వేను నిర్వహిస్తున్నాం. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అనుమా నిత వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో జ్వరంతో బాధ పడుతున్న వ్యక్తులను గుర్తించి వివరాలను నమోదు చేస్తున్నారు. అక్కడి కక్కడే మెడికల్‌ కిట్స్‌ పంపిణీ చేస్తున్నారు.

Updated Date - 2022-08-13T05:57:30+05:30 IST