రూ.202 కోట్లతో ఇంటింటికీ తాగునీరు

ABN , First Publish Date - 2021-02-25T05:19:28+05:30 IST

విజయనగరం డివిజన్‌ పరిధిలో రూ.202 కోట్లతో ఇంటింటికీ తాగునీరు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌డ బ్ల్యూఎస్‌ ఈఈ కె.శివానందకుమార్‌ చెప్పారు.

రూ.202 కోట్లతో ఇంటింటికీ తాగునీరు

ఫ ఆర్‌డబ్యూఎస్‌ ఈఈ శివానందకుమార్‌ 

గజపతినగరం, ఫిబ్రవరి 24: విజయనగరం డివిజన్‌ పరిధిలో రూ.202 కోట్లతో ఇంటింటికీ తాగునీరు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌డ బ్ల్యూఎస్‌ ఈఈ కె.శివానందకుమార్‌ చెప్పారు. స్థానిక ఆర్‌డబ్యూఎస్‌ కార్యాల యాన్ని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లా డుతూ వచ్చేనెల 22 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు అందజేస్తామన్నారు. గ్రామాల్లో కమిటీల ద్వారా 10శాతం పన్ను వసూలు చేసి సిబ్బందికి వేతనాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. అలాగే ఏఏ గ్రామాల్లో వాటర్‌ ట్యాంక్‌లు అవసరమో గుర్తించి  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. జగనన్న హౌసింగ్‌ కాలనీలకు కూడా తాగునీరు సరఫరా చేస్తామన్నారు. ఇంతవరకు ఈ డివిజన్‌ పరిధిలో 27 లేఅవుట్లలో బోరు వేశామని వెల్లడించారు. గ్రామ కమిటీల ద్వారా మార్చి నెలాఖరునాటికి రూ.4కోట్ల 42లక్షలతో అభివృద్ధి పనులు పూర్తిచేస్తామన్నారు. ఆయన వెంట డీఈ కవిత, జేఈ నానిబాబు ఉన్నారు. 


Updated Date - 2021-02-25T05:19:28+05:30 IST