తల్లిపోయిన దుఃఖంలో ఉంటే.. ఇంటి (కబ్జా)‘దారులు’ మూసివేత!

ABN , First Publish Date - 2022-05-17T17:22:09+05:30 IST

భర్త లేకపోయినా రెక్కలు ముక్కలు చేసుకొంది ఆ తల్లీ..! చిన్నచిన్న పనులు చేసుకుంటూ

తల్లిపోయిన దుఃఖంలో ఉంటే.. ఇంటి (కబ్జా)‘దారులు’ మూసివేత!

  • వీధిన పడిన మున్సిపల్‌ కార్మిక కుటుంబం


హైదరాబాద్‌సిటీ : భర్త లేకపోయినా రెక్కలు ముక్కలు చేసుకొంది ఆ తల్లీ..! (Mother) చిన్నచిన్న పనులు చేసుకుంటూ నగర శివార్లలో 160 చదరపు గజాల భూమి కొనుగోలు చేసుకుని, పెంకుటిల్లు కట్టుకుంది. కుమారుడు, కుమార్తె వివాహం చేసింది. మనుమలు, మనమరాళ్లతో హాయిగా బతుకుతున్న క్రమంలో ఆ తల్లీ తనువు చాలించింది. తల్లీపోయిన దుఃఖంలో ఆ కొడుకు (Son) ఉండగా.. కబ్జాదారులు ఆ ఇంటిపై కన్నేశారు. ఓ వైపు పోలీసు, మరోవైపు రక్షణ శాఖలో మాజీ ఉద్యోగి ఇలా ఎవరికి వారు అన్ని వైపుల నుంచి కబ్జాచేసి ఆ ఇంటికి వెళ్లే దారులన్నీ (Way) మూసేశారు. దాంతో ఐదేళ్లుగా ఆ కుటుంబం వీధినపడిం ది. తమకు దారి ఇవ్వాలని వేడుకుంటోంది.


బోగి కమలమ్మకు బండగ్‌పేటలో 160 చదరపు గజాల్లో అప్పటి గ్రామ పంచాయతీ.. ప్రస్తుత మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫీసుకు కేవలం 200 మీటర్ల దూరంలోనే అన్నపూర్ణకాలనీ రెండో వీధిలో పెకుంటిల్లు ఉంది. ఆమె కుమారుడు  నరేష్‌ జీహెచ్‌ఎంసీలో పారిశుధ్య విభాగంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం నరేష్‌ తల్లీ కమలమ్మ చనిపోయింది. ఆ సమయంలో రెండు నెలల పాటు ఇంటికి దూరంగా ఉండాలని నరే్‌షకు బంధువులు, కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో నరేష్‌ రెండు నెలల తర్వాత ఇంటికి వెళ్లగా, అన్ని వైపుల నుంచి తన స్థలాన్ని కబ్జాచేసేశారు. కనీసం ఇంట్లోకి వెళ్లే దారి కూడా లేకుండా చేశారు.


ఆ ఇంటి వీధిని ఆక్రమించి ఒకరు ఇల్లు (House) కట్టారు. అలాగే, నరేష్‌ ఇంటికి రెండు వైపులా మూడు గజాల విస్తీర్ణంలో సందులు(నడిచేందుకు వీలుగా దారి) ఉండేది. ఆ స్థలాలనూ కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. దీంతో నరేష్‌ ఇంటికి వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. ఇదేమని అడిగితే ఇల్లు అ మ్ముకుని వెళ్లాలని, అది కూడా తమకే అమ్మాలని బెదిరిస్తున్నారని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై స్థానిక మున్సిపల్‌, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. ఐదేళ్లుగా ఆ ఇంటి ఆలనాపాలనా లేకపోవడంతో శిథిలావస్థకు చేరుతోందని, కబ్జాదారులపై చర్యలు తీసుకుని తన ఇంటికి దారి కల్పించాలని వేడుకుంటున్నాడు.

Updated Date - 2022-05-17T17:22:09+05:30 IST