కరోనా కట్టడికి నేటి నుంచి ఇంటింటి సర్వే

ABN , First Publish Date - 2021-05-06T06:38:50+05:30 IST

కరోనా నియంత్రణకోసం మునిసిపల్‌ సిబ్బంది, ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో ఇంటింటి సర్వే చేయించాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ సూచించారు. మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, కోఆర్డినేటింగ్‌ అధికారులతో బుధవారం ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌ ద్వారా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కరోనా కట్టడికి నేటి నుంచి ఇంటింటి సర్వే
ఆన్‌లైన్‌ గూగుల్‌మీట్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌

మునిసిపల్‌, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో సర్వే బృందాలు 

జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు గుర్తించి మెడికల్‌ కిట్లు అందించాలి 

ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌లో కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ 



భువనగిరిరూరల్‌, మే 5: కరోనా నియంత్రణకోసం మునిసిపల్‌ సిబ్బంది, ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో ఇంటింటి సర్వే చేయించాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ సూచించారు. మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, కోఆర్డినేటింగ్‌ అధికారులతో బుధవారం ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌ ద్వారా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జ్వరం, జలుబు, దగ్గు ఇతర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్‌ కిట్లతోపాటు తగు వైద్యసాయం అందించాలన్నారు. కరోనా కట్టడికి ఇంటింటి సర్వేపై మార్గదర్శకాలను వివరించారు. 4, 5 రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు తదితర ఇబ్బందులతో బాధపడే వారిని గుర్తించి మెడికల్‌ కిట్‌ అందించడంతో పాటు తగు వైద్యసాయం అందించాలన్నారు. 1000 ఇళ్లకు ఒక టీం చొప్పున ఇంటింటి స ర్వే చేపట్టాలని, పట్టణ ప్రాంతాల్లో అంగన్‌వాడీల సహకారం తీసుకోవాలన్నారు. కా గా ఇంటింటి సర్వే కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆక్సిజన్‌, బెడ్ల కొరత లేకుండా చూడాలన్నారు. గురువారం ఉదయం నుంచే ఇంటింటిసర్వే నిర్వహించాలని అదేశించారు. గూగుల్‌ మీట్‌లో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సాంబశివరా వు, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ పరిపూర్ణాచారి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T06:38:50+05:30 IST