తగ్గిన ఇళ్ల ధరలు...

ABN , First Publish Date - 2021-06-11T22:19:56+05:30 IST

ఇళ్ళ ధరలు గత ఏడాది (2020) మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది (2021) మార్చి త్రైమాసికంలో 1.6 శాతం మేర క్షీణించాయని ప్రాపర్టీ అడ్వైజరీ నైట్ ఫ్రాంక్ తన తాజా రీసెర్చ్ నివేదిక ‘గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్-క్యూ12021’లో వెల్లడించింది.

తగ్గిన ఇళ్ల ధరలు...

న్యూఢిల్లీ : ఇళ్ళ ధరలు గత ఏడాది (2020) మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది (2021) మార్చి త్రైమాసికంలో 1.6 శాతం మేర క్షీణించాయని ప్రాపర్టీ అడ్వైజరీ నైట్ ఫ్రాంక్ తన తాజా రీసెర్చ్ నివేదిక ‘గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్-క్యూ12021’లో వెల్లడించింది. అంతర్జాతీయంగా కూడా భారత్ ర్యాంకు తగ్గినట్లు పేర్కొంది. కిందటి(2020) సంవత్సరం మొదటి త్రైమాసికంలో 43 వ ర్యాంకులో ఉన్న భారత్ ఈ ఏడాది మొదటి త్రైమాసికం నాటికి... 12 స్థానాలు తగ్గి 55 వ స్థానానికి పడిపోయింది. కాగా... డిసెంబరు త్రైమాసికంలోని 56 వ స్థానంతో పోలిస్తే మాత్రం కాస్త ముందుకు జరిగింది. మార్చి త్రైమాసికంలో ఒక స్థానం ముందుకు వచ్చింది.



జూలై-సెప్టెంబరు 2020 త్రైమాసికంతో పోలిస్తే ఇళ్ల ధరల వృద్ధి 0.6 శాతం, అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే 1.4 శాతం వద్ధి నమోదైంది. ఇక... 56 దేశాలు టెర్రిటరీస్ ఇళ్ల ధరల సూచీలను గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ పరిగణనలోకి తీసుకుంది. కిందటి సంవత్సరం(2020) మొదటి తంకైమాపి్ం నుంచి ఈ ఏడాది(2021) మధ్య టర్కీ అన్ని దేశాల కంటే ముదుంది. టర్కీలో ఏడాది ప్రాతిపదికన 32 శాతం, న్యూజీలాండ్ 22.1 శాతం, లగ్జెంబర్గ్ 16.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఏడాది ప్రాతిపదికన 1.8 శాతం క్షీణతతో స్పెయిన్ చివరలో నిలిచింది. ఆ తర్వాత భారత్ 1.6 శాతం క్షీణతతో ఉంది.

Updated Date - 2021-06-11T22:19:56+05:30 IST