స్థలాలు ఇచ్చారు..ఇళ్ల నిర్మాణాలు లేవు

ABN , First Publish Date - 2021-06-13T05:41:49+05:30 IST

గృహనిర్మాణ పథకం అమలుపై నెలకొన్న పలు సమస్యలను జిల్లా లోని పలు వురు ప్రజాప్రతినిధులు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు ముందు ఏకరువు పెట్టారు.

స్థలాలు ఇచ్చారు..ఇళ్ల నిర్మాణాలు లేవు
సమావేశంలో మాట్లాడుతున్నమంత్రి రంగ నాథరాజు

ఇళ్ల సమస్యలపై మంత్రికి 

ప్రజాప్రతినిధుల ఏకరువు

ఇసుక అందించాలని వినతి

సమిష్టి కృషితో గృహాలు పూర్తి 

మంత్రి శ్రీరంగనాథరాజు

ఏలూరు, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): గృహనిర్మాణ పథకం అమలుపై నెలకొన్న పలు సమస్యలను జిల్లా లోని పలు వురు ప్రజాప్రతినిధులు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు ముందు ఏకరువు పెట్టారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల గృహ నిర్మాణ పథకంపై శనివారం కలెక్టరేట్‌లో ఆయన నిర్వహిం చిన సమీక్షా సమా వేశంలో పలువురు ఎమ్మెల్యేలు ఇలా స్పందించారు. తమ నియోజకవర్గాల్లో గతంలోనే ఇళ్ల స్థలాలు కేటాయించినా ఇళ్ల నిర్మాణాలు చేపట్ట లేదని ఉంగుటూరు, పోలవరం, గోపాలపురం ఎమ్మె ల్యేలు పుప్పాల శ్రీని వాసరావు, తెల్లం బాలరాజు, తలారి వెంకట్రావు మంత్రి దృష్టికి తెచ్చారు. మరి కొంత మంది ఇసుక సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను మంత్రికి వివరించారు. జేపీ సంస్థ ఉచిత ఇసుక సరఫరా చేయడం లేదుని టన్నుకు 475 రూపాయల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని మంత్రికి తెలియజేశారు. దీనిపై స్పందించిన ఆయన తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారు. సమా వేశంలో మంత్రి మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టి కృషితో గృహ నిర్మాణాలు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జగనన్న కాలనీల నిర్మాణంలో విద్యుత్‌, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, ఇంటర్నెట్‌ వంటి అన్ని సదు పాయాలతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలి పారు.మండల స్థాయిలో ప్రతి 20 ఇళ్లకు ఒక అధి కారిని నియమిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని వేగి రపరచడం కోసం జిల్లాకు ఒక ఐఏఎస్‌ అధికారిని అదనంగా కేటాయించామన్నారు. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా జిల్లాలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణ వివారాలు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జిల్లాలో మంజూరైన 1,70,699 ఇళ్లకు  1,39,353 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టామని, వివిధ కారణాలతో 31,346 ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోతున్నామని తెలిపారు. జిల్లాలో 1138 లే అవుట్లలో 1,23,125 ఇళ్ల స్థలాలు ఇచ్చామని, వాటిలో 1,041 లే అవుట్లలో లెవెలింగ్‌ పూర్తి చేశామని చెప్పారు. 1,020 చోట్ల తాగునీటి పనులు చేపట్టామని, జూలై 15 నాటికి మూడు విడతలుగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 516 లేఅవుట్లలో విద్యుత్‌ సరఫరా ఏర్పాటు చేశామని, కాలనీల్లో శాశ్వత మౌలిక వసతుల కోసం 2,112 కోట్ల రూపాయల అంచనాలతో డీపీఆర్‌లు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో నిర్మాణం కానున్న ఇళ్లలో 1,09,913 మంది లబ్ధిదారులు మొదటి ఆప్షన్‌, 53,061 మంది రెండో ఆప్షన్‌, 14,163 మంది మూడో ఆప్షన్‌ ఎంచుకున్నారని తెలిపారు. వీటిలో ఇప్పటికే 13,587 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యా యని తెలిపారు. జిల్లాలో 228 ఇటుక బట్టీలు ఉన్నా యని, ఏడాదికాలంలో వాటి ద్వారా 40 కోట్ల ఇటు కలను తయారు చేయొచ్చని కలెక్టర్‌ తెలిపారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిని పర్యవేక్షించడానికి ఏలూరు, నరసా పురం డివిజన్లకు జడ్పీ సీఈవోను, కొవ్వూరు, జంగా రెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్లకు డీపీవోను కేటా యించామన్నారు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ భరత్‌ గుప్తా, గృహ నిర్మాణ శాఖ ఓఎస్‌డీ శివ ప్రసాద్‌, జేసీలు వెంకట రమణారెడ్డి, హిమాన్షు శుక్లా, జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, ఇంజనీరింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-13T05:41:49+05:30 IST