గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-24T06:37:13+05:30 IST

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు.

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్‌

అమలాపురం టౌన్‌, మే 23: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా  అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఎంపీడీవోలు, తహశీలార్లు, గృహ నిర్మా ణశాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది సమన్వ యంతో పనిచేసి లక్ష్యాలను అధిగమించాలన్నారు. సోమవారం కలె క్టరేట్‌ నుంచి వివిధ మండలాలకు చెందిన అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. మండలాల వారీగా గృహనిర్మాణాల లక్ష్యాల పురోగతిపై సమీక్షించారు. ఒక్కో ఇంటికీ రూ.1.80 లక్షలు రుణం  అందించడంతో పాటు డ్వాక్రా ద్వారా పావలా వడ్డీకి రూ.35వేలు రుణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి జియో ట్యాగింగ్‌, మార్కింగ్‌, మ్యాపింగ్‌ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు, గృహనిర్మాణ సంస్థ పీడీ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-05-24T06:37:13+05:30 IST