బుగ్గిపాలైన ఇల్లు...ఒకరికి తీవ్ర గాయాలు
సౌత్ 24 పరగణాలు (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని బసంతిలో బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడులో ఒక ఇల్లు కాలి బూడిదైంది.బాంబు పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు జరిగిన ఇల్లు హమీజుద్దీన్ సర్దార్కి చెందినదని, అతను గాయపడి ఇంటి నుంచి పారిపోయాడని ఒక పోలీసు అధికారి తెలిపారు.ఆరు గంటల పాటు వెతికిన తర్వాత హమీజుద్దీన్ తన ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో కనిపించాడు. అతన్ని చికిత్స కోసం సబ్ డివిజనల్ ఆసుపత్రికి తీసుకెళ్లామని పోలీసులు తెలిపారు.
బసంతి తృణమూల్ ఎమ్మెల్యే శ్యామల్ మాట్లాడుతూ, బాంబు పేలుడు ఘటనలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని చెప్పారు. కొందరు సంఘ వ్యతిరేక శక్తులే బాంబుపేలుడుకు పాల్పడ్డాయని శ్యామల్ చెప్పారు. ఈ పేలుడు ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాంబు పేలుడుకు కారణమైన వారిని అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశామని ఎమ్మెల్యే చెప్పారు. బీర్భూమ్ హింసాకాండ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ధంకర్ ఢిల్లీలో హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు.మరోవైపు పోలీసులు బాంబు పేలుడు జరిగిన ఇంటి యజమాని హమీజుద్దీన్ సర్దార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి