House Arrest: కాంగ్రెస్‌, సీపీఎం నేతల హౌస్‌అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-07-17T15:45:04+05:30 IST

జిల్లాలో కాంగ్రెస్‌, సీపీఎం (CPM) నేతల హౌస్‌అరెస్ట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) పర్యటన దృష్ట్యా ముందస్తు అరెస్ట్‌లు చేసినట్లు తెలుస్తోంది.

House Arrest: కాంగ్రెస్‌, సీపీఎం నేతల హౌస్‌అరెస్ట్‌

భద్రాద్రి: జిల్లాలో కాంగ్రెస్‌, సీపీఎం (CPM) నేతల హౌస్‌అరెస్ట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) పర్యటన దృష్ట్యా ముందస్తు అరెస్ట్‌లు చేసినట్లు తెలుస్తోంది. సీఎం పర్యటనకు ఎలాంటి ఆటంక కలుగకుండా కాంగ్రెస్, వామపక్ష నేతలను అరెస్ట్ చేశారు. భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న విపత్తు, గోదావరి వరద పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు కేసీఆర్‌ ఆదివారం భద్రాచలం (Bhadrachalam) వెళ్లనున్నారు. ఆ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. వరదల వల్ల ప్రజలకు కలిగిన కష్టనష్టాలను ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా తెలుసుకుని, అవసరమైన మేరకు సహాయాన్ని ప్రకటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-07-17T15:45:04+05:30 IST