అంచనాలు మిస్సయినా... హాట్‌‌స్టాకే

ABN , First Publish Date - 2021-10-17T21:48:56+05:30 IST

రెవెన్యూ, మార్జిన్‌ అంచనాల కంటే తగ్గింది. నిరాశాజనక ఫలితాల నేపధ్యంలో ఈ స్టాక్‌ గురువారం 1.17 శాతం తగ్గి రూ. 1,250.9 వద్ద ముగిసింది. కంపెనీ ఫలితాలు అంచనాలను అదుకోలేకపోయినా,

అంచనాలు మిస్సయినా... హాట్‌‌స్టాకే

హైదరాబాద్ : రెవెన్యూ, మార్జిన్‌ అంచనాల కంటే తగ్గింది. నిరాశాజనక ఫలితాల నేపధ్యంలో  ఈ స్టాక్‌ గురువారం 1.17 శాతం తగ్గి రూ. 1,250.9 వద్ద ముగిసింది. కంపెనీ ఫలితాలు అంచనాలను అదుకోలేకపోయినా, ఈ స్టాక్‌పై దలాల్‌ స్ట్రీట్‌ బుల్లిష్‌గానే ఉండడం గమనార్హం. గతంలో ఇచ్చిన 'బయ్‌' రేటింగ్‌ను ఇప్పటికీ కొనసాగిస్తున్నప్పటికీ... మాక్వెయిర్  'ఔట్‌పెర్పార్మ్‌, జేపీ మోర్గాన్ మాత్రం 'వర్‌వెయిట్‌' రేటింగ్‌ను కొనసాగిస్తున్నాయి.


స్థిర కరెన్సీ ప్రాతిపదికన : ఉత్పత్తులు, ప్లాట్‌ఫారం బిజినెస్‌లో త్రైమాసికం నుంచి త్రైమాసికంలో ఎనిమిది శాతం క్షీణత కారణంగా అంచనాను ఈ కంపెనీ భారీగా మిస్సయిందని ఎన్‌కే ఎనలిస్టులు చెబుతున్నారు. ఆదాయ అంచనాలను 0.8-3.3 శాతం తగ్గించారు. ఆకర్షణీయమైన విలువ, భవిష్యత్తు ఆదాయ వృద్ధిని దృష్ట్యా 'బయ్‌' రేటింగ్‌ కొనసాగుతోంది. స్టాక్ ప్రస్తుతం 2023 ఆర్ధిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు  22 రెట్లతో ట్రేడవుతోంది, ఇది మార్జిన్‌ సేఫ్టీని అందిస్తుందని మోతీలాల్ ఓస్వాల్ సంస్థ  చెబుతోంది. మోర్గాన్ స్టాన్లీ, మాక్వెయిర్...  స్టాక్‌ టార్గెట్ ప్రైస్‌ను వరుసగా 2 శాతం, 3 శాతం తగ్గించాయి. ఉత్పత్తుల వ్యాపారంలో తగ్గుదల కారణంగా, 2022-24 'సంవత్సరాల ఆదాయ అంచనాలను మాక్వెయిర్ 2-6 శాతం తగ్గించింది.

Updated Date - 2021-10-17T21:48:56+05:30 IST