ఏ స్టార్ హోటల్‌లో ఎటువంటి సౌకర్యాలుంటాయో తెలుసా?

ABN , First Publish Date - 2022-05-30T15:35:03+05:30 IST

వివిధ రకాల స్టార్ హోటల్స్ గురించి మీరు వినేవుంటారు.

ఏ స్టార్ హోటల్‌లో ఎటువంటి సౌకర్యాలుంటాయో తెలుసా?

వివిధ రకాల స్టార్ హోటల్స్ గురించి మీరు వినేవుంటారు. ఇప్పుడు ఏ స్టార్ హోటల్‌లో ఎటువంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసుకుందాం. 

వన్ స్టార్: హోటల్‌కు వన్ స్టార్ రేటింగ్ వస్తే, ఆ హోటల్‌లో ప్రాథమిక సౌకర్యాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని అర్థం. ఈ రేటింగ్‌ హోటల్ గదుల్లో టీవీ, ల్యాండ్‌లైన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది రాత్రి బస కోసం మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ భోజనానికి కావాల్సిన వసతులు కూడా ఉండవు. ఛార్జ్ పరంగా ఇది చాలా చౌకగా ఉంటుంది.

టూ స్టార్: ఇది కొంచెం అప్‌గ్రేడ్. గదులలో టెలివిజన్, ఫోన్ మొదలైనవి ఉంటాయి. 24 గంటల డెస్క్ సేవ అందుబాటులో ఉంటుంది. మీరు ఇక్కడ Wi-Fiని ఉపయోగిస్తే దాని ఛార్జ్ బిల్లులో జత అవుతుంది. కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

త్రీ స్టార్: సాధారణంగా మూడు నక్షత్రాల హోటల్ బస చేయడానికి ఉత్తమ ఎంపికగా పరిగణిస్తారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ గదులు పెద్దవిగా ఉంటాయి.  గదిలో సోఫాలు ఉంటాయి. LCD TV ఉంటుంది. 

ఫోర్ స్టార్: ఈ రేట్ హోటల్‌లో అనేక రకాల లగ్జరీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. గదిలో మంచం పరిమాణం పెద్దదిగా ఉండటంతో పాటు అది ప్రీమియం నాణ్యతతో ఉంటుంది. లైవ్ మ్యూజిక్, వర్కౌట్ జోన్‌తో పాటు రెస్టారెంట్ కూడా ఉంటుంది.  సిబ్బంది సేవ అందుబాటులో ఉంటుంది.

ఫైవ్ స్టార్: ఇటువంటి హోటల్స్ అత్యంత విలాసవంతమైనవిగా పరిగణిస్తారు. దీనిలో స్టీమ్ రూమ్, గోల్ఫ్ కోర్స్, జిమ్, అవసరమైన సౌకర్యాలతో పాటు ఆన్-డిమాండ్ ఫుడ్ సదుపాయం అందుటులో ఉంటుంది. 

 


Updated Date - 2022-05-30T15:35:03+05:30 IST