Abn logo
Nov 28 2020 @ 01:07AM

హోటల్‌లోకి దూసుకువెళ్లిన టిప్పర్‌ లారీ

ముమ్మిడివరం, నవంబరు 27: టిప్పర్‌ లారీ కారును ఢీకొని పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకుపోయింది. శుక్రవారం అమలాపురం నుంచి వస్తున్న షిఫ్ట్‌ కారు మహిపాలచెరువు సెంటర్‌కు వచ్చిన తర్వాత వెనుకకు వెళ్లేందుకు కారును తిప్పుతుండగా  అమలాపురం వైపు వెళ్తున్న టిప్పర్‌లారీ అదుపుతప్పి షిఫ్ట్‌ కారును ఢీకొట్టి రోడ్డుపక్కన ఉన్న హోటల్‌లోకి దూసుకుపోయింది. దీంతోహోటల్‌ బయట ఉన్న ఆవు మృతిచెందింది. షిఫ్ట్‌కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఎవరికీ గాయాలు కాలేదు. 


Advertisement
Advertisement
Advertisement