ఏడాదిన్నర తర్వాత చిగురించిన ‘హోటల్ ఇండస్ట్రీ’...

ABN , First Publish Date - 2022-02-09T20:47:52+05:30 IST

థర్డ్‌‌వేప్‌ కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో... హోటల్ ఇండస్ట్రీలో ఆశలు చిగురించాయి. మూడో త్రైమాసికంలో బలమైన నంబర్లను కాకపోయినా, ఆశాజనక అంకెలను హోటళ్లు పోస్ట్ చేశాయి.

ఏడాదిన్నర తర్వాత చిగురించిన ‘హోటల్ ఇండస్ట్రీ’...

లీజర్ ట్రావెల్... కోవిడ్ ముందుస్థాయికంటే 120 శాతం అధికంగా... 

ఆశాజనక నంబర్ల పోస్టింగ్... 

అయినప్పటికీ... షేర్ల కొనుగోలు ముందు అప్రమత్తత అవసరం... 

న్యూఢిల్లీ : థర్డ్‌‌వేప్‌ కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో... హోటల్ ఇండస్ట్రీలో ఆశలు చిగురించాయి. మూడో త్రైమాసికంలో బలమైన  నంబర్లను కాకపోయినా, ఆశాజనక అంకెలను హోటళ్లు పోస్ట్ చేశాయి. టాటా గ్రూప్‌లోని ఇండియన్ హోటల్స్ కంపెనీ... అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక ఫలితాలు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయి. దేశంలోనే ఇది అతిపెద్ద లిస్టెడ్ హోటల్ చైన్. వార్షిక ప్రాతిపదికన... కంపెనీ నికర అమ్మకాలు రెట్టింపై, రూ. 1,111 కోట్లకు చేరాయి. వరుసగా ఆరు త్రైమాసిక నష్టాల తర్వాత... మూడో త్రైమాసికంొలో మొదటిసారి నికరలాభాన్ని నమోదు చేసింది. లగ్జరీ సెగ్మెంట్ బలమైన పనితీరు, వ్యాపార ప్రయాణాల పునరుద్ధరణ తదితర అంశాలు ఇందుకు ఊతమిచ్చాయి. 


లీజర్‌ ట్రావెల్‌ కోవిడ్‌ పూర్వ స్థాయి కంటే 120 శాతం పెరిగింది. వ్యాపార ప్రయాణాలు దాదాపు 80 శాతం మేర కోలుకున్నాయి. మొత్తంగా చూస్తే... కొవిడ్‌ ముందున్న ఆదాయాల్లో ఇప్పుడు 85 శాతం అందుతోంది. గోవా మార్కెట్‌లో ఇది పోటీ హోటళ్ల కంటే ముందంజలో ఉంది. కోవిడ్-పూర్వ స్థాయిల్లో 126 శాతం ఆదాయాలనందుకుంది. మరో లీజర్‌ డెస్టినేషన్‌ అయిన రాజస్థాన్‌లోనూ, రెండేళ్ల క్రితం నివేదించిన ఆదాయానికన్నా ఒకింత అధికంగానే సంపాదించింది. బిజినెస్‌ డెస్టినేషన్స్‌లో ఇతర హోటళ్ల కంటే మెరుగ్గానే ఉన్నపన్పటికీ... ఢిల్లీ,, ముంబై, బెంగళూరు తదితర  మార్కెట్లలో మాత్రం ఆదాయాలు ఇంకా కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకోలేదు. ఇప్పటికైతే... 68-82 శాతం బ్యాండ్‌లో కొనసాగుతున్నాయి.


పెరిగిన గది అద్దెలు, ఆక్యుపెన్సీ ఆధారంగా... ‘రెవెన్యూ పర్‌ ఎవైలబుల్‌ రూమ్‌’ వార్షిక ప్రాతిపదికన 1.9 రెట్లు, త్రైమాసికంలో 62 శాతం మేర పెరిగింది. ఇక... 2022 ఆర్ధిక సంవత్సరం తొమ్మిది నెలల్లో కార్పొరేట్ ఓవర్‌హెడ్స్‌ 23 శాతం తగ్గాయి. కోవిడ్‌కు ముందు (2019-20) స్థాయిలతో పోలిస్తే 2022 మూడో త్రైమాసికంలో 17 శాతం తగ్గాయి. నిర్వహణ లాభాల మార్జిన్లు కోలుకుని, 29 శాతంతో, మల్టీ-క్వార్టర్‌ గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. సాంప్రదాయ వ్యాపారంలో పునరుద్ధరణ, వ్యయం ఆదా కార్యక్రమాలు, కొత్త వ్యాపార కార్యకలాపాల ద్వారా మార్జిన్‌ మెరుగైందని కంపెనీ వెల్లడించింది.


ఆదాయాలు, నిర్వహణ లాభాల్లో వృద్ధిని దృష్ట్యా ... 2022 ఆర్ధిక సంవత్సరం నిర్వహణ లాభాల అంచనాలను 20 శాతానికి మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ పెంచింది. కాగా... 2022-23, 2023-24 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన అంచనాలను మాత్రం యథాతథంగానే ఉంచింది. కాగా... త్రైమాసికం ప్రాతిపదికన ఏకీకృత నికర రుణాలు తగ్గడం మరో సానుకూలాంశం. ఇవి, రూ. 1,905 కోట్ల నుంచి రూ. 1,666 కు తగ్గాయి. రైట్స్‌ ఇష్యూ ద్వారా సేకరించిన మూలధనం కారణంగా రుణాల్లో అధిక భాగం తగ్గిపోయాయి. 


ప్రస్తుత మూడో వేవ్ నేపధ్యంలో ఆతిథ్య రంగంలో సమీప కాలంలో ఆదాయాలు తగ్గే ప్రమాదం ఉన్నప్పటికీ, తర్వాత చాలా బలమైన రీబౌండ్‌కు దారితీస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో... ఇప్పటి బలహీనతను అవకాశంగా షేర్లను కొనుగోలు చేయవచ్చని మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్‌ చెబుతోంది. కాగా... కంపెనీ ఆపరేషనల్‌ మెట్రిక్స్‌ బలంగా ఉన్నప్పటికీ; పెట్టుబడిదారులు ఈ స్టాక్‌ను కొనేముందు, వచ్చే త్రైమాసికంలోనూ స్థిరత్వం (డిమాండ్, రూమ్ రేట్లు మరియు ఆక్యుపెన్సీలు) కొనసాగించగలదా ? లేదా ? అన్నది నిర్ధారించుకోవడం సబబని చెబుతున్నారు. 

Updated Date - 2022-02-09T20:47:52+05:30 IST