2 వేల అడుగుల ఎత్తులో హోటల్‌!

ABN , First Publish Date - 2022-05-09T05:30:00+05:30 IST

షాంఘై టవర్‌. చైనాలో ఉన్న ఈ భవనానికి ప్రపంచంలోనే రెండో ఎత్తైన ఆకాశహర్మ్యంగా గుర్తింపు ఉంది.

2 వేల అడుగుల ఎత్తులో హోటల్‌!

షాంఘై టవర్‌. చైనాలో ఉన్న ఈ భవనానికి ప్రపంచంలోనే రెండో ఎత్తైన ఆకాశహర్మ్యంగా గుర్తింపు ఉంది. 128 అంతస్తులున్న ఈ భవనంలో ఒక హోటల్‌ను ఏర్పాటు చేశారు. అందులో వింతేముంది అంటారా? ఆ హోటల్‌ను ఏర్పాటు చేసింది ఆ భవనం పై అంతస్తులో! ఆ హోటల్‌లో కూర్చుంటే షాంఘై నగర అందాలు కనువిందు చేస్తాయి. ‘జే హోటల్‌’గా పిలుస్తున్న ఈ హోటల్‌లో ప్రత్యేకతలు బోలెడున్నాయి.  2వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ హోటల్‌కి వరల్డ్‌ టాలెస్ట్‌ హోటల్‌గా గుర్తింపు దక్కింది. ఈ హోటల్‌లో ఆధునిక సదుపాయాలున్న 165 గదులున్నాయి. ఇండోర్‌ స్విమ్మింగ్‌పూల్‌, లగ్జరీ స్పా వంటి సదుపాయాలున్నాయి. దుబాయిలో ఉన్న గెవొరా హోటల్‌కి 2018లో వరల్డ్‌ టాలెస్ట్‌ హోటల్‌గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కింది. 1168 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హోటల్‌ని తలదన్నేలా 2 వేల అడుగులో ఎత్తులో ఇప్పుడు ‘జే హోటల్‌’ని ఏర్పాటు చేశారు. 

Read more