Hotstar: ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో హాట్‌స్టార్.. ‘నవ్వాపుకుంటున్నావ్ కదరా’ అనే రేంజ్‌లో మీమ్స్..!

ABN , First Publish Date - 2022-06-14T00:33:04+05:30 IST

2023-2027 కాలానికి గాను ఐపీఎల్‌ మీడియా హక్కుల కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్న ఈ-వేలం రెండో రోజు ముగిసింది. ‘బి’ ప్యాకేజీ కింద భారత ఉపఖండంలో..

Hotstar: ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో హాట్‌స్టార్.. ‘నవ్వాపుకుంటున్నావ్ కదరా’ అనే రేంజ్‌లో మీమ్స్..!

2023-2027 కాలానికి గాను ఐపీఎల్‌ మీడియా హక్కుల కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్న ఈ-వేలం రెండో రోజు ముగిసింది. ‘బి’ ప్యాకేజీ కింద భారత ఉపఖండంలో డిజిటల్ హక్కులను వయాకామ్ 18 సొంతం చేసుకుంది. 410 మ్యాచ్‌లకు గానూ డిజిటల్ ప్రసార హక్కులు రూ.20,500 కోట్లు పలకడం గమనార్హం. అయితే.. ఈ-వేలంలో ప్రధాన పోటీ డిస్నీ హాట్ స్టార్, వయాకామ్ 18 మధ్య ఉందని భావించినా చివరికి ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులు వయాకామ్ 18నే వరించాయి.



వయాకామ్ 18కు Voot అనే OTT Platform ఉంది. వచ్చే సీజన్ నుంచి ఈ యాప్‌లోనే ఐపీఎల్‌ను డిజిటల్ వీక్షకులు వీక్షించనున్నారు. ఇప్పటివరకూ ఐపీఎల్ డిజిటల్ ప్రసారాలు అందిస్తున్న హాట్ స్టార్ ఈ బిడ్డింగ్‌లో చేతులెత్తేయడంతో సోషల్ మీడియాలో హాట్ స్టార్‌పై మీమ్స్ ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లను చూడటం కోసమే చాలామంది యూత్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. అలాంటి వారిపై ట్విట్టర్‌లో జోకులు పేలుతున్నాయి. ఎంతలా అంటే.. ట్విట్టర్‌లో Hotstar హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యేంతలా. కొందరు ఏకంగా rip హాట్ స్టార్ అని ట్వీట్ చేస్తున్నారు. Happy Retiremnet Bro #Hotstar అని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. ఆ ఫన్నీ మీమ్స్ మీరూ చూడండి.















Updated Date - 2022-06-14T00:33:04+05:30 IST