Abn logo
Sep 22 2021 @ 00:42AM

హాస్టల్స్‌ను పునఃప్రారంభించాలి

ధర్నా చేస్తున్న బీఎస్పీ నాయకులు

- బీఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 21: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను, హాస్టల్స్‌ను పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నిషాని రామచంద్రం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల రాని కరోనా బహుజన బిడ్డల గురుకులాలు ప్రారంభిస్తేనే వస్తుందా అని ప్రశ్నించారు. వెంటనే గురుకులాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. 21వ డివిజన్‌ కార్పొరేటర్‌  పట్టా స్థలాల్లో స్మశాన వాటికను నిర్మించి అక్కడి ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.  తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణాపూర్‌ కాలనీలో ఇళ్లు లేని నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు వారిని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని అన్నారు. ఇండ్లులేని ప్రజలను వేధింపులకు గురిచేస్తే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డె శ్రీనివాస్‌, సంఘటన మంత్రి బుత్కూరి కాంత, కార్యదర్శి నల్లాల రాజేందర్‌, అసెంబ్లీ అధ్యక్షుడు సంగుపట్ల మల్లేశం, మాంకాలి తిరుపతి, పోతర్లరాజు, మారపెల్లి మొగిలియ్య, కరీంనగర్‌టౌన్‌ అధ్యక్షుడు గాలి అనిల్‌ కుమార్‌, హుజూరాబాద్‌ మహిళా కన్వీనర్‌ అక్కరపడమల్లే శిరీష తదితరులు పాల్గొన్నారు.