హాస్టల్‌ విద్యార్థుల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2022-07-06T06:42:15+05:30 IST

హాస్టల్‌ విద్యార్థులు మంగళవారం ఆకలి కేకలు వేశారు.

హాస్టల్‌ విద్యార్థుల ఆకలి కేకలు
హాస్టల్‌

తొలిరోజే నఖనఖలాడిపోయారు..

300 మంది విద్యార్థులు పస్తులు

కానరాని ముందస్తు ఏర్పాట్లు

అధ్వానంగా హాస్టళ్ల నిర్వహణ

వార్డెన్లు లేరు.. సిబ్బందీ లేరు

విద్యార్థుల అయోమయం

శిథిలావస్థలో వసతి గృహాలు


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

హాస్టల్‌ విద్యార్థులు మంగళవారం ఆకలి కేకలు వేశారు. పాఠశాలలు ప్రారంభంకావడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని హాస్టళ్ల బాట పట్టారు. ఉదయం నుంచి సుమారు 300 మంది హాస్టళ్లకు చేరుకున్నారు. వీరిలో 150 మంది 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు.. అయితే హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కానరాక.. వండి వార్చేవారు లేక.. వార్డెనూ రాక.. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా కనీసం అధికారులు స్పందించకపోవడం గమనార్హం.. 


నాడు నేడు పాఠశాలలకేనా.. హాస్టళ్లకు లేదా.. అన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. అయినా పట్టించుకునే వారే కరవు..విద్యా సంవత్సరం ఆరంభమైనా వసతి గృహాలు పూర్తిగా సిద్ధం కాలేదు. కొన్ని హాస్టళ్లు తెరిచినా విద్యార్థులు కనీసం  నివసించడానికి వీలులేకుండా ఉన్నాయి. రాజమహేంద్రవరంలో కొన్ని హాస్టళ్లు పర్వాలేదు. పూర్తి సౌకర్యాలు లేకపోయినా, అరకొరగానైనా ఉన్నాయి. అయితే కొన్ని హాస్టళ్లలో మాత్రం సౌకర్యాలే లేవు. ఈ పరిస్థితుల్లోనే మంగళవారం హాస్టళ్లు తెరిచారు. అక్కడ వంట చేసేవారు లేరు.. అటెండర్లుకానీ ఎవరూ లేరు. కొన్ని హాస్టళ్లకు ఇంకా వార్డెన్లు జాయిన్‌ కాలేదు. అసలే ఆలస్యంగా జూలైలో విద్యాసంవత్సరం ప్రారంభించినా హాస్టళ్లను సిద్ధం చేయలేకపోయారు. 


జిల్లాలో 37 హాస్టళ్లు..

జిల్లాలో 37 హాస్టళ్లు ఉన్నాయి. అందులో 9 కాలేజీ హాస్టళ్లు. వీటి నిర్వహణకు జిల్లా స్థాయి అధికారి ఒకరు ఉంటారు. గతంలో జిల్లా సోషల్‌ వెల్ఫేల్‌ ఆఫీసరు ఉం డేవారు.ఇటీవల పేరు మార్చి డీఎస్‌సీడబ్ల్యూ ఈవోగా పిలుస్తున్నారు. ఇక జిల్లాకు సంబంధించి గతంలో రాజమమహేంద్రవరంలో ఒకరు, కొవ్వూరులో ఒకరు ఏఎస్‌డబ్ల్యువోలు ఉండేవారు. ఇటీవల రాజానగరంలో ఒకరు, దేవరపల్లిలో ఒకరిని నియమించారు.ఈ నలుగురు పరిధిలో హాస్టళ్లు ఉంటాయి. రాజమహేంద్రవరం ఏఎస్‌డబ్యువో పరిధిలో 10 హాస్టళ్లు,  రాజానగరం పరిధిలో 8, కొవ్వూరు పరిధిలో 9, దేవరపల్లి పరిధిలో 10 వసతి గృహాలు ఉన్నాయి. ఒక్కో హాస్టల్‌లో కనీసం 100 మంది విద్యార్థులు ఉండాలి. కొవిడ్‌ సమయం నుంచి కొంత మందితగ్గిపోయారు.మంగళవారం కొన్ని హాస్టళ్ల కు 300 మంది విద్యార్థులే హాజరయ్యారు.రాజమహేంద్రవరంలో ఒక హాస్టల్‌కు నలుగురే వచ్చారు.


వెంటాడుతున్న సిబ్బంది కొరత 


జిల్లాలో ఒక్క హాస్టళ్లలో కూడా సరిపడ సిబ్బంది లేరు.జిల్లాల పునర్విభజన తరువాత సోషల్‌వెల్ఫేర్‌ శాఖను విభజించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జిల్లా కలెక్టరేట్లు ఏర్పడి మూడు నెలలు పూర్తయ్యాయి. కానీ ఎస్‌సీ, బీసీ, ఎస్‌టి సంక్షేమశాఖ అధికారుల విభజన జరగకపోవడంతో కలెక్టరేట్‌లో ఆ శాఖలే లేవు. ఎట్టకేలకు సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి చేరారు. ఆమెకు జిల్లాపై అవగాహన రావడానికి కొంత సమ యం పడుతోంది.మంగళవారం జిల్లాలోని ఏఎస్‌డబ్ల్యుఓలతో ఆమె సమావేశమై హాస్టళ్ల పరిస్థితిని ఆరా తీశారు. ప్రతి హాస్టల్‌లోనూ  హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (వార్డెన్‌)తో పాటు కుక్‌,వాచ్‌మన్‌, కమాతి( అటెండర్‌) ఉండాలి. ఏ హాస్టల్‌లోనూ ఈ సిబ్బంది లేరు. కొన్ని చోట్ల ఒక్కొక్కరు ఉన్నా రు. కొన్ని చోట్ల వార్డెన్లు లేరు. ఇటీవల పోస్టులు కేటాయించినప్పటికీ, ఇంకా ఎవరూ చేరలేదు. వాటికి తోడు ఇటీవల బదిలీలలో ఉన్నవారు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. అక్కడ నుంచి మాత్రం ఎవరూ రాలేదు.  మరో వారం రోజుల్లో వీరు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. హాస్టళ్లలో సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడంతో తొలిరోజు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. భోజనం లేక పోవడంతో నకనకలాడిపోయారు.బుధవారం నుంచి   ఆహారం పెట్టేవారెవరనేది ప్రశ్నార్థకంగా ఉంది.


 కాలేజీ హాస్టళ్లకు సిబ్బంది లేరు..


 జిల్లాలో 9 కాలేజి హాస్టళ్లు ఉన్నాయి. గతంలోనే కాలేజి హాస్టళ్ల నిర్వహణను  కాకినాడకు చెందిన వికాస ఏజెన్సీకి అప్పగించారు. ఈ హాస్టళ్లలో ప్రభుత్వం తరపునుంచి వార్డెన్‌ ఒక్కరే ఉంటారు.మిగతా సిబ్బంది అంతా ఈ ప్రైవేట్‌ ఏజెన్సీ మనుషులే. హాస్టళ్ల నిర్వహణ అంతా వారే చూసుకుంటారు. కానీ గతంలో చేసిన పనికి వీరికి ఇంకా ప్రభుత్వం సొమ్ములు చెల్లించలేదు. సిబ్బందికీ ఏడాదిగా జీతాలు లేవు. దీంతో  వారు ఇంకా రంగంలోకి దిగలేదు. వాస్తవానికి కాలేజి హాస్టళ్లు గతనెలలోనే ప్రా రంభయ్యాయి. కానీ ఎక్కడెక్కడి నుంచో  వచ్చిన విద్యార్థులు భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం ఇంత వరకూ పట్టించుకోలేదు.  


శిఽథిలావస్థలో వసతి గృహాలు


జిల్లాలో కొన్ని వసతి గృహాలు శిఽథిలావస్థలో ఉన్నా యి. కోరుకొండ మండంలోని రెండు హాస్టళ్లూ పాడైపోయాయి. కోటికేశవరం హాస్టల్‌ ఎప్పుడో శిథిలావస్థకు చేరుకుంది. దానికి భయపడి విద్యార్థులు చేరడం మానేశారు. ఎవరైనా తప్పనిసరి పరిస్థితుల్లో చేరితే అక్కడ హైస్కూలులోని గదుల్లోనే హాస్టల్‌ నిర్వహిస్తున్నారు.  కోరుకొండలోని బాలుర వసతి గృహం అధ్వానంగా ఉంది. జిల్లాలో ఇటువంటి హాస్టళ్లు చాలా ఉన్నాయి.  


Updated Date - 2022-07-06T06:42:15+05:30 IST