ప్రభుత్వ ఆస్పత్రులలో సీఐడీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-11T05:09:37+05:30 IST

జాతీయ హెల్త్‌ మిషన్‌లో భాగంగా 2015-18 మధ్య కాలంలో బయో మెడికల్‌ పరికరాల నిర్వహణకు మంజూరైన నిధుల్లో అవకతవకలు జరగినట్లు సీఐడీ అధికారులు నిర్థారించారు.

ప్రభుత్వ ఆస్పత్రులలో సీఐడీ తనిఖీలు
జ్వరాల ఆస్పత్రిలో రికార్డులను తనిఖీ చేస్తున్న సీఐడీ అధికారులు

బయో మెడికల్‌ పరికరాల నిర్వహణ నిధుల్లో అవకతవకలు

కేసు నమోదు చేసిన సిఐడి...రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులలో తనిఖీలు

గుంటూరు, ఏప్రిల్‌ 10: జాతీయ హెల్త్‌ మిషన్‌లో భాగంగా 2015-18 మధ్య కాలంలో బయో మెడికల్‌ పరికరాల నిర్వహణకు మంజూరైన నిధుల్లో అవకతవకలు జరగినట్లు సీఐడీ అధికారులు నిర్థారించారు. దీనికి సంబంధించి ఆయా ఆస్పత్రులలో శనివారం తనిఖీలు చేపట్టింది. జిల్లాలో జీజీహెచ్‌, అమరావతి రోడ్డులోని జ్వరాల ఆస్పత్రి, బాపట్ల, సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రులు 75 త్యాళ్ళూరులోని ప్రైమరీ హెల్త్‌సెంటర్‌, ఫిరంగిపురం, మేడికొండూరు, రెడ్డిపాలెం, బెల్లంకొండ, చండ్రాజుపాలెం, పెదపలకలూరు, ఫణిదం, యడ్లపాడు, పెరవలి, తదితర 23 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఐడీ బృందాలు తనిఖీ నిర్వహించాయి. బయో మెడికల్‌ నిర్వహణ ఎలా ఉంది..? ప్రతీ పరికరానికి ట్యాగింగ్‌ చేశారా..?  సరైన ధర నిర్ణయించారా...? ఆయా పరికరాల్లో ఎన్ని పని చేస్తున్నాయి...? ఎన్ని పాడయ్యాయి...? సర్వీసింగ్‌ సక్రమంగా చేయకపోతే జరిమానా ఏమన్నా విధించారా..? తదితర అంశాలకు సంబంధించిన వివరాలను ఆయా అదఙకారులను తనిఖీ చేసి పరిశీలించారు. ఆస్పత్రులలో ఆయా పరికరాలను చాలావరకు పని చేయకపోవటంతో పక్కన పడవేశారని అదనపు ఎస్పీ విజయపాల్‌ తెలిపారు. అయితే అవి సక్రమంగా పని చేస్తున్నట్లు రికార్డులలో చూపించి బిల్లులు క్లైమ్‌ చేసినట్లు ప్రాథమికంగా నిర్థారించామన్నారు. 

Updated Date - 2021-04-11T05:09:37+05:30 IST