అమెరికా ఆసుపత్రుల్లో లక్షమంది రోగులు కరోనాతో చేరిక

ABN , First Publish Date - 2020-12-03T13:04:57+05:30 IST

అమెరికా దేశంలో మళ్లీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ మళ్లీ వ్యాపిస్తుందా? అంటే....

అమెరికా ఆసుపత్రుల్లో లక్షమంది రోగులు కరోనాతో చేరిక

వాషింగ్టన్ (అమెరికా): అమెరికా దేశంలో మళ్లీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ మళ్లీ వ్యాపిస్తుందా? అంటే అవునంటున్నారు అమెరికా కొవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్టు అధికారులు. అమెరికా దేశంలోని ఆసుపత్రుల్లో కరోనా వైరస్ తో లక్షమందికి పైగా రోగులు చికిత్స కోసం చేరారని అమెరికా కొవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్టు అధికారులు తాజాగా ట్వీట్ చేశారు. యునైటెడ్ స్టేట్సులో కొవిడ్ -19తో 1,00,226 మంది రోగులు మొట్టమొదటిసారి ఆసుపత్రిలో చేరారని కొవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్టు అధికారులు చెప్పారు. అమెరికా దేశంలో మొట్టమొదటిసారి ఆసుపత్రుల్లో చేరిన కరోనా రోగుల సంఖ్య లక్ష దాటిందని కొవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-12-03T13:04:57+05:30 IST