ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు కేటాయించాలి : కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

ABN , First Publish Date - 2021-05-08T06:07:30+05:30 IST

జిల్లాలో ఆరోగ్యశ్రీ వున్న కొవిడ్‌ ఆస్పత్రుల్లో పేషెంట్లకు 50 శాతం బెడ్లు కేటా యించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు కేటాయించాలి : కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

ఏలూరు, మే 7(ఆం ధ్రజ్యోతి): జిల్లాలో ఆరోగ్యశ్రీ వున్న కొవిడ్‌ ఆస్పత్రుల్లో పేషెంట్లకు 50 శాతం బెడ్లు కేటా యించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆరోగ్యశ్రీ లేని ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలందించేందుకు తాత్కాలిక అనుమతులు పొందాలన్నారు. ఆరోగ్యశ్రీ ఉన్న ఆస్పత్రుల్లో సాధారణ, ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లలో 50 శాతం కచ్చితంగా కొవిడ్‌ బాధితులకు కేటాయించి ఉచిత వైద్యం అందించాలన్నారు. కొన్ని ఆస్పత్రుల్లో బెడ్‌ ఇవ్వడానికి, వైద్యం అందించడానికి డబ్బు తీసుకుంటున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 104 కాల్‌ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులపై స్పందించడమే కాకుండా, వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాక్సినేషన్‌ సెంటర్లలో గుంపులు లేకుండా చూడాలన్నారు. బ్యాంకులు, ఇతర ప్రాంతాల్లో జనం గుమికూడకుండా చూడాలన్నారు. వీసీలో జేసీ హిమాన్షు శుక్లా, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో ఉదయభాస్కర్‌, డీసీహెచ్‌ఎస్‌ ఏవీఆర్‌ మోహన్‌, డీఎంహెచ్‌వో సునంద తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-08T06:07:30+05:30 IST