Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 1 2021 @ 13:29PM

ఆస్పత్రికి వచ్చే రోగితో పరిచయం పెంచుకున్నాడు.. అప్పుడప్పుడు అతడి ఇంటికి కూడా వెళ్లేవాడు.. చివరికి ఆ కాంపౌండర్ చేసిన నిర్వాకమిది..!

ఇంటర్‌నెట్‌డెస్క్: ఆరోగ్యం బాగోలేదని ఓ వ్యక్తి భార్య సహాయంతో ఆస్పత్రికి వెళ్లేవాడు. అక్కడ ఓ కాంపౌండర్ అతడితో పరిచయం పెంచుకున్నాడు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అప్పుడప్పుడు ఆ కాంపౌండర్ రోగి ఇంటికి వస్తుంటే.. ‘ఎంత మంచివాడో’అని అనుకునేవాడు. కానీ ఆ కాంపౌండర్ ఓ రోజు దారుణమే చేశాడు. అతడు చేసి పని తెలిసి ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..


జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి నివశిస్తున్నాడు. ఓ రోజు అతనికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. చికిత్స నిమిత్తం భార్యను తీసుకుని సర్కండలోని ఖమ్త్రాయ్ రోడ్‌లో‌ని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఆ వ్యక్తికి జంజ్‌గిర్‌ జిల్లాలోని అకల్తారా పట్టణం సోనాదులా ప్రాంతానికి చెందిన విజయ్ పాటిల్ అనే ఆస్పత్రి కాంపౌండర్ పరిచయమయ్యాడు. ఓ రోజు రోగి అడ్రస్ కనుక్కొని మరీ విజయ్ అతడి ఇంటికి వెళ్లాడు. ‘ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుందామని వచ్చా..’అని చెప్పడంతో రోగి కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఎంత మంచి వ్యక్తో కదా.. అని విజయ్ గురించి ఆ వ్యక్తి తన భార్యతో అనేవాడు. పరిచయం బాగా పెరగడంతో.. విజయ్ అప్పుడప్పుడు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా, విజయ్ శుక్రవారం రాత్రి ఓ దారుణానికి పాల్పడ్డాడు.


ఆఫీసు పని నిమిత్తం శుక్రవారం రాత్రి భర్త వేరే ఊరికి వెళ్లాడు. ఇంట్లో భార్య, కుమారుడే ఉన్నారు. ‘మీ ఆయన ఉన్నారా..?’అంటూ విజయ్ ఇంట్లోకి దూరాడు. లేడని భార్య చెప్పడంతో.. ఎప్పటినుంచో ఆమె మీద కన్నేసిన విజయ్ అవకాశం దొరికింది కదా అని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం భర్త రాగానే భార్య విషయం చెప్పింది. వెంటనే భార్యను తీసుకొని దగ్గర్లోని  పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్‌ను 24గంటల్లోపు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement