ఆపరేషన్ థియేటర్‌లో పాము, కోతి! ఆస్పత్రి రెస్పాన్స్ ఏంటంటే..

ABN , First Publish Date - 2020-05-28T00:33:28+05:30 IST

అది ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్(ఓఆర్). క్రిములకు కూడా స్థానం లేని ఆ ప్రదేశంలో ఓ కోతి, పాము దర్శనమివ్వడం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో చోటుచేసుకుంది.

ఆపరేషన్ థియేటర్‌లో పాము, కోతి! ఆస్పత్రి రెస్పాన్స్ ఏంటంటే..

ట్రినిడాడ్ అంట్ టొబాగో: అది ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్(ఓఆర్). క్రిములకు కూడా స్థానం లేని ఆ ప్రదేశంలో ఓ కోతి, పాము దర్శనమిచ్చిన ఘటన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో చోటుచేసుకుంది. ఆపరేషన్ థియేటర్‌లో కోతిని చూసిన సిబ్బంది ఒకరు పై అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు.. ఆస్పత్రి యాజమాన్యం శస్త్ర చికిత్సలన్నీ వాయిదా వేసి ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేసింది. ఈలోపు అక్కడ ఓ పాము కూడా ఉన్నట్టు వదంతులు మొదలయ్యాయి. అయితే ఆస్పత్రి మాత్రం వీటికి కొట్టిపారేసింది. ఓఆర్‌లో పాము లేదని గట్టిగా చెప్పొకొచ్చిన యాజమాన్యం.. కోతి ప్రాస్తవన మాత్రం దాటవేసింది. దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కోతి ఉన్న పర్లేదు కానీ పాము లేకపోతే చాలా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-05-28T00:33:28+05:30 IST