సినిమా దృశ్యాలు నిజజీవితంలో చూశాం

ABN , First Publish Date - 2022-03-06T18:01:54+05:30 IST

సినిమాల్లో మాత్రమే చూసిన యుద్ధ దృశ్యాలను నిజ జీవితంలో చూసి బెంబేలెత్తిపోయామని వైద్యవిద్యార్థి నందిని తెలిపారు. యుద్దభూమి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న హొసపేట వైద్యవిద్యార్థి నందిని క్షేమంగా ఇంటికి

సినిమా దృశ్యాలు నిజజీవితంలో చూశాం

                          - హొసపేట వైద్య విద్యార్థిని


బళ్లారి(కర్ణాటక): సినిమాల్లో మాత్రమే చూసిన యుద్ధ దృశ్యాలను నిజ జీవితంలో చూసి బెంబేలెత్తిపోయామని వైద్యవిద్యార్థి నందిని తెలిపారు. యుద్దభూమి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న హొసపేట వైద్యవిద్యార్థి నందిని క్షేమంగా ఇంటికి చేరింది. ఆమె శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరి అక్కడి నుంచి హొసపేటకు చేరి తన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇది జీవితంలో మరవరాని ఘట్టమన్నారు. భారత రాయభార కార్యాలయం అధికారులు చేసిన సహకారంతో తాము ఈరోజు స్వస్థలాలకు చేరుకున్నామన్నారు. ఎంబీబీఎస్‌ 3వ సెమిస్టర్‌ చదువుతున్న తాను ప్రాణాలతో బయటపడితే చాలనుకున్నానన్నారు. తమను క్షేమంగా మన దేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వాలు తమ వైద్య విద్య కొనసాగిం చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-03-06T18:01:54+05:30 IST