Oct 28 2021 @ 18:15PM

‘హార్మోన్స్‌’ చిత్ర నిర్మాత ఇకలేరు!

‘హార్మోన్స్‌’ చిత్ర నిర్మాత, గిరిజన సంక్షేమ  సమితి వ్యవవస్థాపకుడు నూనావత్‌ సారయ్య నాయక్‌ గుండె పోటుతో  ఈ నెల 25న మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరంగల్‌ ములుగు జిల్లా, పత్తిపల్లి గ్రామనికి చెందిన సారయ్య సామాజిక కథాంశంతో డా.ఆనంద్‌ రచన దర్శకత్వంలో 2012లో ‘హార్మోన్స్‌’ అనే చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో మెగాస్టార్‌ చిరంజీవి, డి.రామానాయుడు ప్రశంసలు అందుకున్నారాయన. డా.ఆనంద్‌ దర్శకత్వంలో  ‘బాలికా విద్య’, ‘మానవ హక్కులు’, ప్రజా హక్కు, అంటురానితనం వంటి లఘు చిత్రాలు నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరొందారు.