మద్దునూరు అభివృద్ధిపై ఆశలు..

ABN , First Publish Date - 2022-06-25T07:01:08+05:30 IST

జిల్లాలోని మారుమూల పల్లె మద్దునూరు మహర్దశపై గ్రామస్థులు ఆశలు పెట్టుకున్నారు.

మద్దునూరు అభివృద్ధిపై ఆశలు..


- రాజ్యసభ సభ్యుడు దామోదర్‌ సొంత గ్రామంపై

ముఖ్యమంత్రి ఫోకస్‌

-సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ ప్రతిపాదనలు

సీఎంకు అందనున్న నివేదిక

జగిత్యాల, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారుమూల పల్లె మద్దునూరు మహర్దశపై గ్రామస్థులు ఆశలు పెట్టుకున్నారు. సీఎం కేసీ ఆర్‌ మద్దునూరు అభివృద్ధిపై దృష్టి సారించారు. నేరుగా జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌కు కాల్‌ చేసి గ్రామంలో కావాల్సిన అభివృద్ధి ప నులపై నివేదిక రూపొందించాల్సిందిగా ఇటీవల ఆదేశించారు. ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గల బుగ్గారం మండలంలో మద్దునూరు గ్రామ పంచాయతీ ఉంది. గ్రామంలో ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. సీఎం ప్రత్యేక దృష్టి సారించడంతో తమ సమస్యలకు మోక్షం లభిస్తుందేమోనని గ్రామస్థులు ఆశలు పెంచుకుంటున్నారు.  

గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్‌ ...

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కలెక్టర్‌ రవి నాయక్‌ ఈనెల 22న మద్దునూరు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్న వస తులు, ఇంకా కావాల్సిన వసతులు, జరగాల్సిన అభివృద్ధి పనులు, అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామంలో గల ఉ న్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణా నికి నివేదికను ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గ్రామ శివారు లోని వాగు వద్ద చెక్‌ డ్యామ్‌ నిర్మాణం, గ్రామంలోని పలు కాలనీల్లో సు మారు 3.5 కిలో మీటర్ల సీసీ రహదారి నిర్మాణం, గ్రామ పంచాయతీ  కొత్త భవన నిర్మాణానికి పరిశీలన జరిపారు. గ్రామంలోని పలు ప్రాంతా ల్లో సుమారు రెండు కిలో మీటర్ల మేర డ్రైనేజీ నిర్మాణం, నాలుగు ప్రాం తాల్లో కల్వర్టుల నిర్మాణాలు, శ్మశాన వాటికలో అదనపు వసతులు, మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ మరమ్మతులు తదితర అంశాలను కలెక్టర్‌ పర్యటనలో పరిశీలించారు. 

కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు...

గ్రామంలో సుమారు రూ. 80 లక్షలతో నూతన ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం, రూ. 25 లక్షలతో నూతన పంచాయతీ భవన నిర్మాణం, రూ. కోటితో సీసీ రహదారులు, రూ. 40 లక్షలతో మురికి కాలువల నిర్మా ణం, రూ. 6.50 కోట్లతో జగిత్యాల నుంచి మద్దునూరుకు వచ్చే రహదారి రెండు వరసల దారిగా విస్తరించడం, రూ. 50 లక్షలతో కమ్యూనిటీ హాల్‌, రూ. 20 లక్షలతో సొసైటీ భవన నిర్మాణం జరపాలని గ్రామస్థులు ఆశి స్తున్నారు. గ్రామానికి ఒక ప్రైమరీ హెల్త్‌ సబ్‌ సెంటర్‌ను, మద్దునూరు గ్రామం నుంచి గోపులాపూర్‌ గ్రామం వరకు ఊర చెరువు కట్టపై ఉన్న మట్టి రోడ్డును బీటీగా మార్చడం, మద్దునూరు నుంచి బీరుసాని గ్రామం వరకు గల మట్టి రోడ్డును సీసీగా మార్చడం వంటి పనులు చేయాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామానికి గోదావరి నది నుంచి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. రాజ్యసభ సభ్యు డిగా ఎన్నికయిన దామోదర్‌రావు ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసి గ్రామ పరిస్థితిపై వివరించడంతో గ్రామ అభివృద్ధిపై ఆశలు రేకెత్తుతున్నాయి. 


దామోదర్‌ రావుకు పదవి రావడంతోనే....

మహేశ్‌, మద్దునూరు ఎంపీటీసీ సభ్యుడు

గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత దామోదర్‌ రావుకు రాజ్య సభ సభ్యుడిగా పదవి రావడంతోనే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. దామోదర్‌ రావు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం వల్ల జాతీయ స్థాయిలో మా గ్రామానికి గుర్తింపు వస్తోంది.


అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాం

తిరుపతి, సర్పంచ్‌, మద్దునూరు

జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్న మద్దునూరు అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆశిస్తున్నాం. గ్రామానికి చెందిన రాజ్యసభ సభ్యుడు దామోదర్‌ రావు చొరవతో సీఎం కేసీఆర్‌ మద్దునూరు అభివృద్ధిపై ఫోకస్‌ చేయడం సంతోషకరంగా ఉంది.


సమస్యలు పరిష్కారం అవుతాయి

- మేడిపల్లి మధుసుదన్‌, మద్దునూరు గ్రామ వాసి

గ్రామంలో కొన్నేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాము. సీఎం కేసీఆర్‌ దృష్టి సారించడం, ఇప్పటికే కలెక్టర్‌ రవి గ్రామంలో పర్యటించారు. దీంతో గ్రామ అభివృద్ధిపై ఆశలు పెరుగుతున్నాయి.

సీఎం ఆదేశాలతో ప్రత్యేక దృష్టి సారించాం

గుగులోతు రవి నాయక్‌, జిల్లా కలెక్టర్‌, జగిత్యాల

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మద్దునూరు గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాము. ఇటీవల గ్రామాన్ని సందర్శించి పలు అంశాల ను పరిశీలించాము. సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించనున్నాము.

Updated Date - 2022-06-25T07:01:08+05:30 IST