దళిత బంధుపై ఆశలు

ABN , First Publish Date - 2022-01-25T05:54:39+05:30 IST

దళిత కుటుంబాల ఆర్థికాభి వృద్ధి సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళి త బంధు పథకంపై సంబంధిత నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నా యి.

దళిత బంధుపై ఆశలు

- పథకం అమలుకు వేగం పెంచిన ప్రభుత్వం

- మార్చి నెలలోపు పూర్తి చేయాలని ఆదేశాలు

- లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకే...

- ఒక్కో నియోజకవర్గంలో వంద మందికి లబ్ధి

జగిత్యాల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): దళిత కుటుంబాల ఆర్థికాభి వృద్ధి సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళి త బంధు పథకంపై సంబంధిత నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నా యి. దళిత బంధు పథకాన్ని మరింత వేగవంతం చేయడంపై ప్రభు త్వం దృష్టి సారించింది. మార్చి నెలాఖరులోపు పథకం కింద గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు  కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌తో పాటు పలువురు అధికారులకు  రెం డు రోజుల క్రితం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లు దిశా నిర్ధేశం చేశారు. దీంతో దళిత బంధు పథకం అమలుపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. 

వచ్చే నెల 5లోగా లబ్ధిదారుల ఎంపిక...

దళిత బంధు పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడానికి వచ్చే నెల 5వ తేదిలోపు గడువును ప్రభుత్వం విధించింది. దళిత బంధును వేగవంతంగా పూర్తి చేయడానికి డెడ్‌లైన్‌ పెట్టి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ, లబ్ధి దారుల ఎంపికలను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికలను అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులు...

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపికపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మ పురి నియోజకవర్గాలతో పాటు వేములవాడ, చొప్పదండి నియోజక వ ర్గాల పరిధిలోని మండలాల్లో సైతం లబ్ధిదారుల ఎంపిక చేయడానికి ప్ర యత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గానికి వంద చొప్పున లబ్ధిదారుల చొ ప్పున ఎంపిక చేయాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. దీంతో సం బంధిత సామాజిక వర్గంలో అర్హులైన నిరుద్యోగులకు అటు ప్రజాప్రతిని ధులు, ఇటు అధికారులు ఆరా తీస్తున్నారు. తమ తమ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడానికి కసరత్తులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ధర్మపురి ని యోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిత్యం వహిస్తున్న మంత్రి కొప్పు ల ఈశ్వర్‌తో పాటు జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కు మార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌, చొప్పదండి, వేములవాడ ఎమ్మెల్యేలు సుంకె రవి శంకర్‌, చెన్నమనేని రమేశ్‌బాబులు తమ తమ మండలాల పరిదిలో లబ్ధిదారుల ఎంపికపై దృష్టి సారించారు.

రెండు నెలల్లో గ్రౌండింగ్‌....

ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని వీలైనంత తొందరలో అన్ని నియోజకవర్గాల్లో లక్ష్యం మేరకు పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రానున్న రెండు నెలల్లో గ్రౌండింగ్‌ చేయడానికి అధికారులకు ఆదేశాలు అందాయి. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందులో నుంచి రూ. 10 వేలను దళిత బంధు రక్షణ నిధికి కేటాయిస్తారు. లబ్ధిదారులు కోరుకున్న యూనిట్‌ను మంజూరు చేయాల్సి ఉంటుంది. బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా లబ్ధి చేకూర్చేందుకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఎంపిక సవాలే...

దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేకే అ ప్పగించింది. అధికారులు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకు అవసర మైన సహకారాలను అందించాల్సి ఉంటుంది. దళిత బంధు పథకం కిం ద లబ్ధిదారుల ఎంపిక సవాల్‌గా మారనుంది. నియోజకవర్గానికి వంద మందికి మాత్రమే తొలి విడతలలో లబ్ధి చేకూర్చాల్సి ఉంది. సంబందిత సమాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతీ యువకులు వేల సంఖ్య లో ఉండగా కేవలం వంద మందికి మాత్రమే లబ్ధి అందించాలని ని ర్ణయించడంతో ఎమ్మెల్యేలు ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ని యోజకవర్గాలలో వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయా ల్సి ఉంటుంది. ఈ బాధ్యతను సర్కారు ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఎ మ్మెల్యేలు లబ్ధిదారుల జాబితాను రూపొందించి, జిల్లాకు చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. గ్రామ, మండల స్థా యిలలో కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నియో జకవర్గానికి ఒక అధికారిని ఇన్‌చార్జీగా నియమిస్తున్నారు. పథకాన్ని అ మలు చేసే బాధ్యతను ఇన్‌చార్జీ అధికారి తీసుకోవాల్సి ఉంటుంది. 

ఎంపికైన లబ్ధిదారుడికి రెండు రోజుల్లో అకౌంట్‌....

ప్రతీ నియోజకవర్గంలో అర్హులను సంబంధిత శాసనసభ్యుల ఆమో దంతో ముందుగా వంద మంది లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది. జిల్లా కలెక్టర్‌, అధికారుల స్ర్కూటినీ అనంతరం జిల్లాకు చెందిన మంత్రి సమ క్షంలో ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన లబ్దిదారులకు రెండు రోజు ల్లో ప్రత్యేకంగా బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలన్న ఆదేశాలున్నాయి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచిఎంపిక చేసిన 100 మందికి అవస రమైన శిక్షణ అందించనున్నారు. మార్చి మొదటి వారంలోగా లబ్ధి చేకూ ర్చే విధంగా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. దళిత బందు ద్వారా ఎస్సీ లబ్ధిదారులకు, మరింత మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసు కోవడం అధికారులు దృష్టి సారించారు. అధికారులు, ప్రజాప్రతి నిధులు దళిత బంధు పథకం అమలుపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుండడంతో సంబంధిత వర్గాల్లో మరింత ఆశలు పెరుగుతున్నాయి. 

దేశంలోనే దళిత బంధు ప్రతిష్టాత్మకం

- కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, జగిత్యాల

దేశంలోనే దళిత బంధు పథకం ప్రతిష్టాత్మకమైనది. గతంలో ఎన్న డూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకం వల్ల నిరుపేద షెడ్యూల్‌ కులాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచనున్నాము. జిల్లాలో దళిత బంధు అమలుకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేసుకొని కార్యచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించాము.

పకడ్బందీగా అమలు చేస్తాము

- గుగులోతు రవి నాయక్‌, కలెక్టర్‌, జగిత్యాల

జిల్లాలో దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాము. స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని సకాలంలో లబ్ధిదారుల లి స్టు తయారు చేసి యూనిట్లు గ్రౌండ్‌ చేసే విధంగా చర్యలు తీసుకుం టున్నాము. పథకం అమలుకు ప్రత్యేక కమిటీలు పనిచేయనున్నాయి. అర్హులైన నిరుద్యోగులు దళిత బంధును సద్వినియోగం చేసుకొని సత్పలి తాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నాము.



Updated Date - 2022-01-25T05:54:39+05:30 IST