Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 7 2021 @ 11:12AM

కుమార్తెను అలా చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు.. వెంటనే ఇంట్లోకి లాక్కెళ్లి... ఒళ్లు జలదరింపజేసే మరో పరువు హత్య!

దేశంలో పరువు హత్యలకు అంతం లేకుండా పోతోంది. పిల్లల అభిప్రాయాలను తెలుసుకోకుండా కొందరు తల్లిదండ్రులు దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఇటువంటి ఘటన వెలుగు చూసింది. పొరుగింటి యువకునితోపాటు తన కుమార్తె కనిపించేసరికి ఆ తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెను ఇంటిలోనికి లాక్కొచ్చి, చావబాది, చున్నీతో ఆమె గొంతు బిగించి హత్యచేశాడు. తరువాత మృతదేహాన్ని అక్కడే వదిలివేసి, బయటకు వచ్చి, తలుపులువేసి, కిటికీలో నుంచి లోపల గడియపెట్టి, తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చుట్టుపక్కలవారికి తెలిపాడు.

అయితే మృతురాలి పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం వెలుగు చూసింది. గోహల్‌పూర్ సీఎస్పీ అఖిలేష్ గౌర్ తెలిపిన వివరాల ప్రకారం అక్టోబరు 4న ఉదయం ఒక ఇంటిలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించింది. ఆ యువతి కుటుంబ సభ్యులు తమ అమ్మాయి ఆత్మహత్యకు ఎదురింటిలో ఉంటున్న దేవేంద్ర చౌదరి అనే యువకుడే కారణమని ఆరోపించారు. దేవేంద్ర చౌదరి తమ అమ్మాయిపై అత్యాచారం జరిపాడని వారు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ యువకునిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే మృతురాలి పోస్టుమార్టం రిపోర్టులో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. దీంతో పోలీసులకు మృతురాలి కుటుంబ సభ్యులపై అనుమానం తలెత్తింది. పైగా మృతురాలి మెడపై ఉన్న గాయాలు పోలీసుల అనుమానాన్ని మరింత బలపరిచాయి. 

వారు మృతురాలి తండ్రిని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు... అక్టోబరు 3న రాత్రివేళ తన కుమార్తె ఎదురింటి దేవేంద్ర చౌదరితో పాటు ఉండటం చూశాడు. ఇంతలో ఇతనిని గమనించిన దేవేంద్ర చౌదరి గోడ దూకి పారిపోయాడు. కుమార్తె మాత్రం తండ్రి నుంచి తప్పించుకోలేకపోయింది. ఆగ్రహంతో ఊగిపోతున్న తండ్రి ప్లాస్టిక్‌పైప్‌తో ఆమెపై దాడి చేశాడు. ఆ తరువాత ఇంట్లోకి లాక్కెళ్లి, చున్నీతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. తరువాత తలుపుల బిగించి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నదని చుట్టుపక్కలవారికి చెప్పాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుని నుంచి అసలు విషయాన్ని రాబట్టారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement