నల్ల టీషర్ట్‌లో షట్లర్‌.. చైనా గరం గరం

ABN , First Publish Date - 2021-07-27T09:47:26+05:30 IST

హాంకాంగ్‌ షట్లర్‌ అంగస్‌ ఎంగ్‌ కా నల్ల టీషర్ట్‌ ధరించి మ్యాచ్‌ ఆడడం వివాదం రేపింది. అయితే దీనిని చైనా ఆక్షేపించింది. చైనాలో హాంకాంగ్‌ భాగం. కానీ ప్రజాస్వామ్యం కోరుతూ హాంకాంగ్‌లో జరుగుతున్న ఉద్యమాలను చైనా అడ్డుకుంటున్న సంగతి...

నల్ల టీషర్ట్‌లో షట్లర్‌.. చైనా గరం గరం

హాంకాంగ్‌ షట్లర్‌ అంగస్‌ ఎంగ్‌ కా నల్ల టీషర్ట్‌ ధరించి మ్యాచ్‌ ఆడడం వివాదం రేపింది. అయితే దీనిని చైనా ఆక్షేపించింది. చైనాలో హాంకాంగ్‌ భాగం. కానీ ప్రజాస్వామ్యం కోరుతూ హాంకాంగ్‌లో జరుగుతున్న ఉద్యమాలను చైనా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. తమకు వ్యతిరేకంగా హాంకాంగ్‌లో నల్ల టీషర్టులు ధరిస్తారని అంటున్న చైనా బృందం..అంగస్‌ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది. అయితే దీనిపై హాంకాంగ్‌ అధికారులు స్పందిస్తూ.. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఎలాంటి దుస్తులైనా వేసుకోవచ్చని తమ ఆటగాడి చర్యను సమర్ధించింది. 


Updated Date - 2021-07-27T09:47:26+05:30 IST