కరోనా ఉధృతి నేపథ్యంలో హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-06-11T05:40:47+05:30 IST

కరోనా ఉధృతి నేపథ్యంలో హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం దృష్టి పెట్టింది. 12ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసుగల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిం

కరోనా ఉధృతి నేపథ్యంలో హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా ఉధృతి నేపథ్యంలో హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం దృష్టి పెట్టింది. 12ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసుగల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 12ఏళ్లుపైబడిన పిల్లలకు శుక్రవారం నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. హాంగ్ కాంగ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. హాంగ్ కాంగ్‌లో 7.5 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తుండగా ఇప్పటి వరకు కేవలం 15శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నారు. టీకా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయనే అపోహలతో ప్రజలు టీకా తీసుకుంనేందుకు ముందుకు రావడం లేదు. 


Updated Date - 2021-06-11T05:40:47+05:30 IST