Hong Kong: 150 దేశాల విమానాల రద్దు

ABN , First Publish Date - 2022-01-15T00:39:55+05:30 IST

Hong Kong: 150 దేశాల విమానాల రద్దు

Hong Kong: 150 దేశాల విమానాల రద్దు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా లక్షల్లోనే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హాంగ్ కాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జనవరి 16 నుంచి 150 దేశాల విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నగరంలో ప్రస్తుతం కోవిడ్-19 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇద్దరు ఎయిర్‌లైన్ సిబ్బంది హోమ్ క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత ప్రారంభమైంది. కోవిడ్ పాజిటివ్ కేసులను నియంత్రించడానికి విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-15T00:39:55+05:30 IST