ఎయిరిండియా విమానాలపై హాంగ్ కాంగ్ నిషేధం..!

ABN , First Publish Date - 2020-09-21T14:22:03+05:30 IST

ఎయిర్ ఇండియా విమానాలను తాజాగా హాంగ్ కాంగ్ సస్పెండ్ చేసింది.

ఎయిరిండియా విమానాలపై హాంగ్ కాంగ్ నిషేధం..!

విక్టోరియా: ఎయిర్ ఇండియా విమానాలను తాజాగా హాంగ్ కాంగ్ సస్పెండ్ చేసింది. భారతదేశం నుంచి వస్తున్న ప్రయాణికుల వల్ల తమ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 3వరకు ఎయిరిండియాతో పాటు కాథే డ్రాగన్ విమానాలపై కూడా నిషేధం విధిస్తున్నట్లు హాంగ్ కాంగ్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 18న భారత్‌కు చెందిన ఐదుగురు ప్రయాణికులు కాథే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంగ్ కాంగ్ వెళ్లడం జరిగింది. ఈ ఐదుగురికి కొవిడ్ టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. కాగా, ఈ ట్రిప్‌కు ముందు వీరు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ కూడా సమర్పించడం జరిగిందని అధికారులు తెలిపారు.


ఇక ఇటీవల హాంగ్ కాంగ్‌లో ఒకేరోజు 23 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించిన అధికారులు.. వీరిలో మూడో వంతు మంది బాధితులు భారత్‌ నుంచి ప్రయాణించిన వారు ఉన్నట్లు గుర్తించారు. అందుకే అక్టోబర్ 3వ తేదీ వరకు ఎయిర్ ఇండియా విమానాలపై బ్యాన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆగస్టులో కూడా వందే భారత్ మిషన్‌లో భాగంగా నడిపిస్తున్న ఎయిరిండియా విమానాలపై హాంగ్ కాంగ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.   

Updated Date - 2020-09-21T14:22:03+05:30 IST