కోవాగ్జిన్‌పై హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-11-11T03:33:02+05:30 IST

హైద్రాబాద్ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా టీకాపై హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్‌కు ఆమోదముద్ర వేసింది. అత్యవసర వినియోగం కోసం కోవాగ్జిన్‌ను ఉపయోగించవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన రోజుల

కోవాగ్జిన్‌పై హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం!

ఎన్నారై డెస్క్: హైద్రాబాద్ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా టీకాపై హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్‌కు ఆమోదముద్ర వేసింది. అత్యవసర వినియోగం కోసం కోవాగ్జిన్‌ను ఉపయోగించవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే హాంగ్ కాంగ్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. వియత్నాం కూడా అత్యవసర వినియోగం కోసం కోవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి బుధవారం వెల్లడించారు. ఇదిలా ఉంటే.. యూఎస్, ఆస్ట్రేలియా, స్పెయిన్, యూకే సహా 96 దేశాలు కోవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలను ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. 



Updated Date - 2021-11-11T03:33:02+05:30 IST