కష్టపడితేనే విజయం

ABN , First Publish Date - 2020-09-11T06:36:41+05:30 IST

లక్ష్యాల సాధనకు నిరంతరం కష్టపడి పని చేయడం ఒక్కటే మార్గమని.. అదే విజయాన్ని సాధించి పెడుతుందని కేంద్ర టెక్స్‌టైల్‌, మహిళ, శిశు అభివద్ధి శాఖమంత్రి స్మృతి ఇరానీ అన్నారు...

కష్టపడితేనే విజయం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): లక్ష్యాల సాధనకు నిరంతరం కష్టపడి పని చేయడం ఒక్కటే మార్గమని.. అదే విజయాన్ని సాధించి పెడుతుందని కేంద్ర టెక్స్‌టైల్‌, మహిళ, శిశు అభివద్ధి శాఖమంత్రి స్మృతి  ఇరానీ అన్నారు. జీవితం, కంపెనీ నిర్వహణలో విజయం సాధించడానికి ఒక ప్రత్యేక విధానమంటూ ఏమీ ఉండదు. అన్ని సదుపాయాలు, అవకాశాలు ఉన్న వారు కూడా ఒక్కోసారి పరాజయం పాలవుతారని.. ఏమీ లేని వారు విజయం సాధిస్తారని అన్నారు. సీఐఐ-ఇండియా ఉమెన్‌ నెట్‌వర్క్‌ (ఐడబ్ల్యూఎన్‌) ‘పవర్‌ ఉమన్‌ 2020’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె కీలకోపాన్యాసం చేశారు.


కష్టపడి పని చేయాలని, నిరంతరం నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కొన్ని సందర్భాల్లో లింగ వివక్ష బయటపడుతోందని, దీన్ని నివారించాలని కోరా రు.  ఈ సందర్భంగా కంపెనీల్లో మహిళ డైరెక్టర్లుగా పని చేయడానికి వీలుగా శిక్షణ ఇచ్చేందుకు సీఐఐ-ఐడబ్ల్యూఎన్‌, తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.  

Updated Date - 2020-09-11T06:36:41+05:30 IST