వృద్ధుడి నిజాయితీ

ABN , First Publish Date - 2022-05-16T06:47:17+05:30 IST

దొరికిన సెల్‌ఫోన్‌ను పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి నిజాయితీని నిరూపించుకున్నాడా వృద్ధుడు.

వృద్ధుడి నిజాయితీ
దొరికిన ఫోన్‌ను పోగొట్టుకున్న వ్యక్తికి అందజేస్తున్న దృశ్యం

దొరికిన సెల్‌ఫోన్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగింత

ముదినేపల్లి, మే 15 : దొరికిన సెల్‌ఫోన్‌ను పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి నిజాయితీని నిరూపించుకున్నాడా వృద్ధుడు. ఆదివారం రాత్రి ముదినేపల్లిలో దాసరి ఆశీర్వాదం అనే వ్యక్తి టైలరింగ్‌ షాప్‌కు వచ్చి బైక్‌పై తిరిగి వెళుతున్న సమయంలో సుమారు రూ.20 వేలు విలువైన  సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నాడు. అయితే అది మహ్మద్‌ ముస్తాఫా అనే వృద్ధుడికి దొరికింది. వెంటనే ఆయన  దానిని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. అదే సమయంలో తన ఫోన్‌ పోయిందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆశీర్వాదంకు పోలీసులు దానిని అందజేశారు. ఫోన్‌ను తిరిగి ఇచ్చిన వృద్ధుడిని ఎస్‌ఐ రవిచంద్ర కుమార్‌ అభినందించారు. 


Updated Date - 2022-05-16T06:47:17+05:30 IST