దేశాభివృద్ధి కోసం పన్ను చెల్లింపుదారుల కర్తవ్య దీక్ష : నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2021-07-25T00:25:16+05:30 IST

కర్తవ్యబద్ధంగా తమ వాటా పన్నులను చెల్లిస్తున్నవారు

దేశాభివృద్ధి కోసం పన్ను చెల్లింపుదారుల కర్తవ్య దీక్ష : నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : కర్తవ్యబద్ధంగా తమ వాటా పన్నులను చెల్లిస్తున్నవారు గుర్తింపు పొందేందుకు అర్హులేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. వివిధ సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ఆదాయపు పన్ను శాఖను ప్రశంసించారు. 161వ ఇన్‌కం ట్యాక్స్ డే సందర్భంగా శనివారం ఆమె ఆదాయపు పన్ను శాఖకు ఓ సందేశాన్ని ఇచ్చారు. 


వివిధ ప్రక్రియలు, విధానాలను సరళతరం చేయడం కోసం కృషి చేస్తున్నందుకు, కార్యకలాపాలను న్యాయంగా, ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా నిర్వహిస్తున్నందుకు ఆదాయపు పన్ను శాఖను అభినందించారు. నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులు తమ వంతు పన్నులను కర్తవ్యబద్ధతతో చెల్లిస్తున్నారన్నారు. దేశ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తున్న పన్ను చెల్లింపుదారులు  గుర్తింపు పొందేందుకు అర్హులని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-25T00:25:16+05:30 IST