నిజాయితీ చాటుకున్న కానిస్టేబుల్‌

ABN , First Publish Date - 2020-07-17T10:19:51+05:30 IST

ఓ కానిస్టేబుల్‌ నిజా యితీ చాటుకున్నాడు. తన బ్యాంకు ఖాతాలో పొరపాటున జమైన నగదును బ్యాంకు అధికారుల సమ క్షంలో ..

నిజాయితీ చాటుకున్న కానిస్టేబుల్‌

అభినందించిన ఎస్పీ అమిత్‌బర్దర్‌


శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, జూలై 16: ఓ కానిస్టేబుల్‌ నిజా యితీ చాటుకున్నాడు. తన బ్యాంకు ఖాతాలో పొరపాటున జమైన నగదును బ్యాంకు అధికారుల సమ క్షంలో బాధితుడికి అప్పగించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బూర్జ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న బాలి తవిటినాయు డుకు రాజాం కెనరా బ్యాంకులో వ్యక్తి గత ఖాతా ఉంది. అయితే, ఆయన ఖాతాలో రూ.84,995 జమైనట్లు సెల్‌ ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. తనకు సంబంధం లేకుండా నగదు జమకావడంతో  బ్యాంకుకు వెళ్లి ఆరా తీశాడు. అయితే, రాజాం మండలం గడ్డవలస గ్రామానికి చెందిన బూరాడ తవిటినాయుడు అనే రైతుకు కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు నుంచి రావాల్సిన వ్యవసాయ రుణం మొత్తం ఈయన ఖాతాలోకి జమైనట్లు తెలిసింది.


ఖాతాలో చివరినంబరు మినహా మిగతా అంతా ఒక్కలాగే ఉండ డంతో బ్యాంకు అధికారులు పొరబడ్డారు. బూరాడ తవిటినాయుడు ఖాతాలో జమచేయాల్సిన మొత్తాన్ని బాలి తవిటినాయుడు ఖాతాలో జమచేసేశారు. దీంతో విషయం తెలుసుకున్న కానిస్టేబుల్‌ తన ఖాతాలో జమ అయిన మొత్తాన్ని డ్రాచేసి బ్యాంకు అధికారుల సమక్షంలో బూరాడ తవిటినాయుడుకు అందజేశాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌ కానిస్టేబుల్‌ తవిటినాయుడును  తన కార్యాలయానికి పిలిచి అభినందించారు. నిజాయితీగా విధులు నిర్వహించినవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని ఎస్పీ పేర్కొని.. నగదు పురస్కారాన్ని అందజేశారు. 

Updated Date - 2020-07-17T10:19:51+05:30 IST