యుద్ధ వీరులకు గౌరవ సన్మానం

ABN , First Publish Date - 2021-07-26T05:16:35+05:30 IST

కార్గిల్‌ యుద్ధంతో పాటు 1971 నాటి పోరాటంలో దేశ సరిహద్దుల్లో పోరాడిన యుద్ధవీరులకు ఒంగోలులోని మిలటరీ క్యాంటీన్‌ ఆవరణలో ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ వల్ఫేర్‌ సం ఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించా రు.

యుద్ధ వీరులకు గౌరవ సన్మానం
మాజీ యద్ధ వీరులను సన్మానిస్తున్న మాజీ సైనికులు, అధికారులు

ఒంగోలు(జడ్పీ), జూలై 25: కార్గిల్‌ యుద్ధంతో పాటు 1971 నాటి పోరాటంలో దేశ సరిహద్దుల్లో పోరాడిన యుద్ధవీరులకు ఒంగోలులోని మిలటరీ క్యాంటీన్‌ ఆవరణలో ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ వల్ఫేర్‌ సం ఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించా రు. సోమవారం కార్గిల్‌ విజయ్‌దివస్‌ను పురస్కరిం చుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్గిల్‌ యు ద్ధంలో పాల్గొన్న బి.మురళీకృష్ణ, 1971 యుద్ధంలో పాల్గొన్న నాగేశ్వరరావు, తాడికొండ వెంకటసుబ్బా రావు(నేవీ)లను సన్మానించి యుద్ధసమయాల్లో వా రు చూపిన పోరాటపటిమను మాజీ సైనికులు కొ నియాడారు. కార్యక్రమంలో చుండూరి శ్రీరామమూ ర్తి, డ్వామా పీడీ శీనారెడ్డి, జేఏసీ చైర్మన్‌ నెప్ప ల్లి నాగేశ్వరరావు, జనరల్‌ సెక్రటరీ పాశం వెకంటరెడ్డి తదితరులు పాల్గొన్నారు

బల్లికురవ: కార్గిల్‌ యుద్ధంలో దివ్యాంగుడైన అంబడిపూడి ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బోగినేని మురళీకృష్ణను ఆదివా రం ఒంగోలులో ఘనంగా సత్కరించారు. తర్లుపా డు మండలం సీతనాగులవరం గ్రామానికి చెందిన మురళీకృష్ణ 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో ఎ డమ చెయ్యి పూర్తిగా పోయింది. అనంతరం 2002 లో ప్రభుత్వం మురళీకృష్ణకు రికార్డు అసిస్టెంట్‌గా నియమించింది. కార్గిల్‌ విజయోత్సవం కార్యక్రమం లో భాగంగా ఆయన సత్కరించారు.  


Updated Date - 2021-07-26T05:16:35+05:30 IST