చనిపోయిన వారికి ఇంటి స్థలాలు!

ABN , First Publish Date - 2020-07-04T10:12:13+05:30 IST

చనిపోయిన వారికి ఇంటి స్థలాలు మంజూరు చేస్తూ తాము ఎంత పారదర్శకంగా పేదలకు సహాయపడుతున్నారో వజ్రకరూరు మండల కేంద్రంలోని ఇంటి

చనిపోయిన వారికి ఇంటి స్థలాలు!

వజ్రకరూరు, జూలై 3: చనిపోయిన వారికి ఇంటి స్థలాలు మంజూరు చేస్తూ తాము ఎంత పారదర్శకంగా పేదలకు సహాయపడుతున్నారో వజ్రకరూరు మండల కేంద్రంలోని ఇంటి స్థలాల మంజూరైన అర్హుల జాబితాను గమనిస్తే తెలుస్తుంది. ఈ సంవత్సరం జనవరి 3వ తేదీన మరణించిన చాకలి పోలేరమ్మ, 2019లో చనిపోయిన పట్టావారివీధికి చెందిన లక్ష్మికి ఇంటి స్థలాలు మంజూరు చేశారు. లబ్ధిదారుల ఎంపికలో కొందరు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగింది.


దీంతో నిజమైన లబ్ధి చేకూరలేదు. ఇంతటితో ఆగకుండా కర్నూలు, కర్నాటక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి కూడా ఇంటి స్థలాలు మంజూరు చేయించారు. తోరణగల్లులో నివసిస్తున్న భారతి అనే మహిళకు స్థలాన్ని మంజూరు చేశారు. అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తిలో నివసిస్తున్న పర్వీన్‌ అనే మహిళకు కూడా ఇంటి స్థలాన్ని కేటాయించారు. గ్రామంలో ఉన్న బి.లక్ష్మిదేవి అనే మహిళకు నివాసం ఉన్నప్పటికీ స్థలాన్ని కేటాయించారు. రమీజాబి అనే ఒంటరి వృద్ధురాలికి కూడా నివాసం ఉంది. అయినప్పటికి స్థలాన్ని కేటాయించారు. మండలంలో జరుగుతున్న పరిణామాలను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి కొందరు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మండలంలోని 12 గ్రామాల్లో 1,875 మందిని అర్హులుగా గుర్తించారు. మండల కేంద్రంలో 461మందిని అర్హులుగా గుర్తించగా వీరిపైౖ పూర్తిస్థాయిలో విచారణ జరిపితే 70 నుంచి 100 వరకు అనర్హులుగా తేలే అకాశముంది.


Updated Date - 2020-07-04T10:12:13+05:30 IST