Advertisement
Advertisement
Abn logo
Advertisement

లైంగిక సమస్యలకు హోమియోపతి

ఆంధ్రజ్యోతి(05-01-2021)

మా క్లినిక్‌కు కొత్తగా వచ్చాడో పేషెంట్‌. అతడు యువకుడు. మా జూనియర్‌ డాక్టర్‌ అతన్ని వివరాలు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పకుండా తల పట్టుకుని కూర్చున్నాడు. కాసేపాగి మౌనంగా బయటకు వెళ్లిపోయాడు. రెండు గంటల తరువాత అతడు నా చాంబర్‌లోకి వచ్చాడు. సమస్య ఏంటని అడిగితే ఇలా చెప్పాడు. 


‘నా పేరు కిషోర్‌. 28ఏళ్లు. గుంటూరు నుంచి వచ్చాను సార్‌. ఇంకా 6 నెలల్లో నా పెళ్లి. కానీ నాకో సమస్య ఉంది. మీ ఆర్టికల్‌ పేపర్లో చదివాను సార్‌. అందులో మీరు చెప్పిన విధంగానే నా సమస్యలు ఉన్నాయి. రెండు నెలల క్రితం మా ఫ్రెండ్స్‌ అందరం కలిసి ఒక అమ్మాయి దగ్గరకు వెళ్లాం. మనసులో భయంగా ఉన్నా అమ్మాయితో శృంగారంలో పాల్గొన్నాను. ఆ సమయంలో ఎంజాయ్‌ చేసినప్పటికీ పది రోజుల తర్వాత నా పురుషాంగంపై చిన్న చిన్న నీటి పొక్కులు కనిపించాయి. అవి ఎర్రగా దురదగా ఉంటున్నాయి. భయపడి మా ఊరి డాక్టర్‌కు చూపించాను. ఆయన నన్ను ఇంకా భయపెట్టారు. కానీ ఏవో మందులు రాసిస్తే వేసుకున్నాను. కొన్నిరోజులు తగ్గింది కూడా. కానీ ఇప్పుడు మళ్లీ వచ్చాయి. నాకు భయమేస్తోంది. జీవితంపైన విరక్తి కలుగుతోంది. చచ్చిపోవాలనిపిస్తోంది. నన్ను మీరే బతికించాలి సార్‌’ అంటూ మా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఒక యువకడు. నువ్వేం భయపడకు అని అతనికి ధైర్యం చెప్పి వ్యాధి లక్షణాలు పరిశీలించాక అతడు హెర్పి్‌స వ్యాధితో బాధపడుతున్నాడని అర్థమైంది. 


సుఖవ్యాధులు అంటే ఇవే!


హెర్పిస్‌ జెనిటాలిస్‌

లైంగిక కలయిక తరువాత పురుషాంగం మీద చెమట పొక్కుల ఆకారంలో నీటి పొక్కులు కనిపిస్తాయి. అవి ఎర్రగా ఉండి దురద కలిగిస్తాయి. అవి పగిలి ఎర్రగా పుండు పోతుంది. స్త్రీలలో కూడా జననాంగం మీద చిన్నచిన్న పొక్కుల్లాగా వచ్చి ఎర్రగా మారి విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీని వలన అబార్షన్‌ రావడం, లైంగిక సమస్యలు రావచ్చు. 


గనేరియా

ఇది కూడా లైంగిక వ్యాధి. శృంగారం తరువాత మొదటగా కనిపించే లక్షణం మూత్రంలో మంట, మూత్రనాళం దగ్గర దురదగా ఉంటుంది. జిగురుగా ద్రవం వస్తుంది. కొందరిలో పొత్తి కడుపులో నొప్పి, వీర్యంలో మంట, రక్తం వస్తాయి. 


వెనేరల్‌ వార్ట్స్‌

పురషాంగం మీద చిన్న చిన్న పులిపిరులు వస్తాయి. ఇవి గుత్తులు గుత్తులుగా క్యాలీఫ్లవర్‌లాగా తయారవుతాయి.


షాంకరాయిడ్‌ పుండ్లు

ఇవి కూడా లైంగికంగా సంక్రమిస్తాయి. లైంగిక సంపర్కం తరువాత 3-5 రోజులలోపు ఈ వ్యాధి బయటపడవచ్చు. జననాంగం మీద రెండు, మూడు పుండ్లు ఏర్పడతాయి. ఎర్రగా ఉండి, రుద్దినప్పుడు నొప్పి వస్తుంది. కొద్ది మందిలో జ్వరం, నొప్పులు వుంటాయి.

 

హెచ్‌ఐవీ ఎయిడ్స్‌

హెచ్‌ఐవీ వైరస్‌ మానవ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను నాశనం చేస్తూ చివరకు ఎయిడ్స్‌ వ్యాధి రూపంలో బయటపడుతుంది. నెల రోజులుగా జ్వరం ఉండటం, విరేచనాలు, నెలలో శరీర బరువు పది శాతం తగ్గడం, దగ్గు, బొడ్డుభాగంలో దద్దుర్లు, గొంతు బొంగురు పోవడం, దీర్ఘకాలిక జలుబు, జ్ఞాపకశక్తి తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 


హెపటైటిస్‌- బి

సుమారు 4కోట్ల మంది మనదేశంలో హెపటైటి్‌సతో బాధపడుతున్నారు. ప్రతి ఏటా లక్షమందికి పైగా ఈ వైర్‌సతో చనిపోతున్నారు. రక్తం, లాలాజలం, వీర్యం, యోని ద్రవం లాంటి పదార్థాలలో హెపటైటి్‌స్‌-బి  వైరస్‌ ఉంటుంది. లైంగిక సంపర్కం, లాలాజలం, తల్లిపాలు, స్టెరైజ్‌ చేయని సిరంజీలు ఉపయోగించడం, డ్రగ్స్‌, పచ్చబొట్టు, ఉపయోగించిన బ్లేడ్స్‌, టూత్‌ బ్రష్‌ వాడటం వలన హెపటైటి్‌స-బి రావచ్చు. అయితే అది శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లక్షణాలు బయటపడవు. కాళ్లవాపు, పొట్ట ఉబ్బడం, వాంతులు, ఆకలి తగ్గడం, మూత్రం పచ్చగా రావడం, కళ్లు పసుపు పచ్చగా మారడం, జ్వరం, ఒళ్లంతా నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.


హోమియో చికిత్స

ప్రకృతి నియమాలపై ఆధారపడిన హోమియోపతి శాస్త్రీయమైనది. హోమియో చికిత్స రోగనిరోధక శక్తిని పెంచి మందులు ఇమ్యునో మాడ్యులేటర్స్‌గా పనిచేస్తాయి. సహజత, సత్యత, మానవత లాంటి లక్షణాలు కలిగి ఉన్న అనుభవజ్ఞుడైన హోమియోపతి వైద్యుడు, లైంగిక వ్యాధులను సులభతరంగా పరిష్కరించగలుగుతారు. హోమియోపతిలో వ్యాఽధి మూలాలను గుర్తించి చికిత్స చేయడం జరుగుతుంది.


డా. మధు వారణాశి

MD, MS(PSYCHO), MCSEP

ప్రముఖ హోమియో వైద్యులు

ప్లాట్‌నెం 188, వివేకానందనగర్‌ కాలనీ

కూకట్‌పల్లి, హైదరాబాద్‌

ఫోన్‌ : 8897331110, 8886509509


Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...