హోమియోతో స్పాండిలైటిస్‌ మాయం!

ABN , First Publish Date - 2021-02-02T07:46:46+05:30 IST

మెడనొప్పి, తల తిరుగుడు, వాంతి, వికారం, తూలి పడిపోతున్నామనే భయం... వెరసి స్పాండిలైటిస్‌.

హోమియోతో స్పాండిలైటిస్‌ మాయం!

మెడనొప్పి, తల తిరుగుడు, వాంతి, వికారం, తూలి పడిపోతున్నామనే భయం... వెరసి స్పాండిలైటిస్‌. ఈ సమస్యను ఆధునిక హోమియో చికిత్సతో పరిష్కరించవచ్చు అంటున్నారు ప్రముఖ హోమియో నిపుణులు డాక్టర్‌ మధు వారణాశి.


వెన్నెముకలోని ఏడు పూసల (డిస్క్‌) మధ్య నరాలు ఉంటాయి. వీటి మీద ఒత్తిడి పడడం వల్ల మెడనొప్పి, నడుం నొప్పి వస్తుంది. వయసుతో పాటు వెన్నెముకలో కూడా మార్పులు వస్తాయి. 30 - 50 ఏళ్ల మధ్య ఈ మార్పులు రావచ్చు. పెరిగే వయసుతో డిస్క్‌ల మధ్య దూరం తగ్గి, వెన్నెముక మధ్యలో ఉండే కార్టిలేజ్‌, నరాల మీద ఒత్తిడి కలగజేస్తుంది. కుషన్‌లా పనిచేసే కార్టిటేజ్‌ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎక్కువ ఒత్తిడి పడినప్పుడు శరీర భంగిమల్లో అసౌకర్యం కనిపిస్తుంది. మెడ, భుజాలు బిగుసుకుపోతాయి. మెడ కదలికలు కష్టమవడం, వ్యాయామాలు చేయలేకపోవడం జరుగుతుంది. సరైన భంగిమలో కూర్చోకపోవడం, ఎక్కువ సమయాలు నిలబడడం, కూర్చోవడం వల్ల డిస్క్‌లలో మార్పులొస్తాయి. కంప్యూటర్‌ ఉద్యోగాలు, కాల్‌ సెంటర్‌లో పనిచేసేవారు, ద్విచక్రవాహనం నడిపేవారు, అధిక బరువులు మోసేవారు ఈ వ్యాధికి గురవుతారు.


లక్షణాలు

మెడనొప్పి, మెడ తిప్పలేకపోవడం, నొప్పి మెడ నుంచి భుజాల వరకూ పాకడం, చేతివేళ్ల వరకూ పాకడం, చేతివేళ్లు తిమ్మిర్లు, చేతిలో పట్టు తగ్గడం, తలనొప్పి, తలతిరగడం, వాంతులు ప్రధాన లక్షణాలు. వ్యాధి ముదిరితే కండరాలు కృశించి, రక్తసరఫరాకు ఆటంకం కలుగుతుంది. చేతుల్లో స్పర్శ తగ్గడం, చెవిలో శబ్దాలు, బ్యాలెన్స్‌ తప్పి పడిపోయేటట్టుగా అనిపించడం, తరచూ తలనొప్ప, అధిక రక్తపోటు, భుజాలు పైకి ఎత్తలేకపోవడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి.


లంబార్‌ స్పాండిలైటిస్‌

నడుము నొప్పి, పట్టేసినట్టుగా ఉండడం, కదిలితే నొప్పి, నిలబడలేకపోవడం, కాలు పైకి, కిందకు ఎత్తలేకపోవడం, నడుము కింది భాగంలో నొప్పి, సయాటికా నరంపై ఒత్తిడి, నడుము కింది భాగంలో బలహీనత, స్పర్శ తగ్గడం, కాళ్లలో తిమ్మిరి, వ్యాధి తీవ్ర దశలో నడవలేకపోవడం వంటివి ప్రధాన లక్షణాలు.


ఉపశమన మార్గాలు

మెదడుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మెడపైన ఒత్తిడి పడకుండా చూసుకోవడం, అవరసరాన్నిబట్టి కాలర్‌ ధరించడం, ప్రయాణాల్లో డిస్క్‌లపై ఒత్తిడి లేకుండా చూసుకోవడం, తలతిరుగుతున్నప్పుడు ఒంటరిగా ప్రయాణాలు చేయకపోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి.


హోమియో చికిత్స

మానసిక, శారీరక లక్షణాల ఆధారంగా ఆధునిక హోమియో వైద్య చికిత్సతో ఈ సమస్య నుంచి స్వాంతన పొందవచ్చు. ఇందుకోసం అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రతించాలి. సొంత వైద్యం మానుకుని సరైన హోమియో మందులు వాడితే స్పాండిలైటిస్‌ సమస్య దూరం అవుతుంది.



డా. మధు వారణాశి

MD, MS(PSYCHO), MCSEP

 ప్రముఖ హోమియో వైద్యులు

ప్లాట్‌నెం 188, వివేకానందనగర్‌ కాలనీ

కూకట్‌పల్లి, హైదరాబాద్‌

ఫోన్‌ : 8897331110, 8886509509

Updated Date - 2021-02-02T07:46:46+05:30 IST