హోమియోతో కొవిడ్‌ ఖేల్‌ ఖతం!

ABN , First Publish Date - 2020-11-10T17:49:46+05:30 IST

వ్యాధిని తొక్కిపెట్టి ఉంచితే, ఏదో ఒకనాడు తిరగబెడుతుంది!అలాకాకుండా వ్యాధిని సమూలంగా నాశనం చేస్తే, శాశ్వతంగా అంతరిస్తుంది! ఈ సూత్రం ఆధారంగానే హోమియో వైద్య విధానం పనిచేస్తుంది. అయితే కొత్తగా వచ్చే కొవిడ్‌లాంటి సాంక్రమిక వ్యాధుల మాటేమిటి? వీటికి హోమియో చికిత్స ఉందా? అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. కోవిడ్‌కు కూడా హోమియోలో చికిత్స ఉందని..

హోమియోతో కొవిడ్‌ ఖేల్‌ ఖతం!

ఆంధ్రజ్యోతి(10-11-2020)

వ్యాధిని తొక్కిపెట్టి ఉంచితే, ఏదో ఒకనాడు తిరగబెడుతుంది!అలాకాకుండా వ్యాధిని సమూలంగా నాశనం చేస్తే, శాశ్వతంగా అంతరిస్తుంది! ఈ సూత్రం ఆధారంగానే హోమియో వైద్య విధానం పనిచేస్తుంది. అయితే కొత్తగా వచ్చే కొవిడ్‌లాంటి సాంక్రమిక వ్యాధుల మాటేమిటి? వీటికి హోమియో చికిత్స ఉందా? అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. కోవిడ్‌కు కూడా హోమియోలో చికిత్స ఉందని.. ఇది కోవిడ్‌కు తాత్కాలికంగా కాకుండా సత్వరంగా.. సమర్థంగా.. శాశ్వత ఫలితాలను ఇస్తుందంటున్నారు హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ అంబటి సురేంద్ర రాజు.


వైరస్‌ ద్వారా వచ్చే సాంక్రమిక వ్యాధులకు హోమియోలో చాలా కాలం నుంచి చికిత్స ఉంది. 1800ల నాటికే ఎన్నో రకాల వైరస్‌లకు హోమియోలో మందులు రూపొందాయి. ఈ రెండు వందల ఏళ్లలో దాదాపు అన్ని రకాల వైరస్‌ కారక వ్యాధులన్నిటినీ హోమియో సమర్థమైన మందులతో నయం చేయగలిగింది. ఈ విషయాలను ధ్రువీకరించే డాటా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. కలరా, ప్లేగు, డెంగ్యూ, ఎల్లో ఫీవర్‌, డిఫ్తీరియా, న్యుమోనియా మొదలైన వ్యాధులన్నీ హోమియో వైద్యంతో నయమయ్యాయి. ఇన్ని మహమ్మారులను నయం చేసిన హోమియోకు కరోనానూ నయం చేసే శక్తి ఉంది. 


లక్షణాలే ఆధారంగా!

హోమియోలో ఏ వ్యాధికైనా వ్యక్తి తత్వం, లక్షణాల ఆధారంగా చికిత్సను చేస్తారు. కొవిడ్‌కు కూడా అంతే! అందుకే కొవిడ్‌ వ్యాధి లక్షణాలతో పాటు.. ఊపిరితిత్తుల సిటి స్కాన్‌లను పరిశీలించాల్సి ఉంటుంది. ఒకసారి వ్యాధి తీవ్రతను నిర్ధారించుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా చికిత్స ప్రారంభించవచ్చు. కొవిడ్‌ చికిత్సకు సూచించే మందులు ప్రధానంగా ఆరు రకాలుగా ఉంటాయి. లక్షణాలు, ఇతర అంశాల ఆధారంగా వీటిలో ఒక మందును సూచిస్తాము. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. అల్లోపతి మందుల వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి.


కానీ హోమియో మందుల వల్ల అలాంటి సమస్యలు ఉండవు. ప్రస్తుతం కొవిడ్‌ వచ్చిన వారికి బ్రయోనియా ఆల్బ్‌ -200 అనే మందును ఎక్కువగా సూచించటం జరుగుతోంది. దీని వల్ల కరోనా తాలూకు జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు లాంటి లక్షణాలు అదుపులోకి వస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు- న్యూమోనియా,ఉబ్బసం వంటి వ్యాధులకు దారితీస్తాయి. అప్పుడు వారికి వేరే మందును సూచిస్తాము. ఆర్సెనికం ఆల్బం - 30, ఇన్‌ఫ్లూయింజినం - 30- ఈ రెండు మందులూ నెలకు మూడు రోజుల పాటు వాడితే ఎటువంటి సమస్యలు రావు. 


ముల్లును ముల్లుతోనే...

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. హోమియో వైద్య విధానంలో అదే జరుగుతుంది. హోమియో వైద్య విధానంలో- సారూప్య విధాన చికిత్సా పద్ధతి ఉంటుంది. అంటే వ్యాధి లక్షణాలను మరిపించే విధంగా తీవ్రమైన లక్షణాలు ఏర్పడతాయి. ఫలితంగా సహజసిద్ధంగా సోకిన వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టి అంతరించిపోతాయి. ఇందుకు కారణం హోమియో మందులతో బాధితుల్లో తయారయ్యే లక్షణాలు వ్యాధికారక లక్షణాల కంటే బలంగా ఉండడమే! ఈ చికిత్సా విధానంతో వ్యాధి సమూలంగా నాశనం అవడంతో పాటు, మరోసారి తిరగబెట్టే సమస్య కూడా తప్పుతుంది. హోమియో వైద్య చికిత్సా విధానం సూత్రం ఇదే!


Updated Date - 2020-11-10T17:49:46+05:30 IST